BiggBoss 6 Day 98 : బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్జీవీ భామ..

ఇనయా ఎలిమినేషన్ సడెన్ గా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు నాగార్జున. హౌజ్ లోంచి బయటకి వచ్చి స్టేజి మీదకి వచ్చిన తర్వాత.. ఎలాగైనా కప్పు కొట్టాలనుకున్నాను, కానీ చివరి వరకు వచ్చి చివర్లో వెళ్లిపోవడం ఇంకా బాధగా ఉంది............

BiggBoss 6 Day 98 : బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్జీవీ భామ..

BiggBoss 6 Day 98 inaya sulthana eliminated

Updated On : December 12, 2022 / 6:55 AM IST

BiggBoss 6 Day 98 :  బిగ్‌బాస్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. 21 కంటెస్టెంట్స్ తో మొదలుపెట్టిన బిగ్‌బాస్ నిన్నటితో 14 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం 13 మంది ఎలిమినేట్ అవ్వగా నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఈ సారి బిగ్‌బాస్ నుంచి ఆర్జీవీ భామ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయింది.

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే ఇనయా ఆర్జీవితో డ్యాన్స్ చేసి ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో బాగా ఫేమ్ రావడంతో బిగ్‌బాస్ లోకి ఆర్జీవీ భామగా ఎంట్రీ ఇచ్చింది. మొదట వీక్ కంటెస్టెంట్ గా ఉన్న ఇనయా త్వరగానే వెళ్ళిపోతుంది అనుకున్నారు అంతా. మరో కంటెస్టెంట్స్ ఆర్జే సూర్యతో హౌజ్ లో క్లోజ్ గా ఉంటూ మరింత పాపులర్ అయింది. గేమ్ పట్టించుకోకుండా సూర్య వెనక తిరుగుతున్నావని నాగార్జున ఫైర్ అవ్వడంతో సూర్య వెళ్లిపోయిన దగ్గర్నుంచి గేమ్ మీద ఫోకస్ చేసింది. దీంతో ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చి 14 వారాల తర్వాత ఇప్పుడు ఎలిమినేట్ అయింది ఇనయా.

ఇనయా ఎలిమినేషన్ సడెన్ గా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు నాగార్జున. హౌజ్ లోంచి బయటకి వచ్చి స్టేజి మీదకి వచ్చిన తర్వాత.. ఎలాగైనా కప్పు కొట్టాలనుకున్నాను, కానీ చివరి వరకు వచ్చి చివర్లో వెళ్లిపోవడం ఇంకా బాధగా ఉంది అని చెప్పింది. వెళ్లేముందు మిగిలిన కంటెస్టెంట్స్ గురించి చెప్పమన్నాడు నాగార్జున.

Allu Arjun – Mahesh Babu : ఒకే వేదికపై సూపర్ స్టార్, ఐకాన్ స్టార్..

ఇనయా హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ”శ్రీహన్ మంచివాడని చాలా లేట్ గా అర్థమైంది. అతను కప్పు కొట్టి రావాలి. ఆదిరెడ్డి నిజాయితీగా ఆడతాడు. శ్రీసత్య తనకి నచ్చినవాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది, నచ్చకపోతే అవతలివాళ్ళని రెచ్చగొడుతుంది. కీర్తి ఎంతటి బాధని అయినా తట్టుకోగలదు. రోహిత్ చాలా డీసెంట్, తన శక్తిని బయట పెట్టట్లేదు, ఇక రేవంత్ అందరికి మంచి చెప్పాలని చూస్తాడు కానీ అది అవతలివాళ్ళకి నచ్చదు అని చెప్పింది. ఇక ఇనయా సుల్తానా వెళ్ళాక ఈ వారంలో బుధవారం మరో ఎలిమినేషన్ ఉంటుంది, ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు నాగార్జున.