Sohel Birthday Gift : సోహైల్‌కు అభిమాని సర్‌ఫ్రైజ్ బర్త్‌డే గిఫ్ట్.. సింగరేణి ముద్దుబిడ్డ ఫిదా

Biggboss Fame Syed Sohel Ryan
Biggboss Fame Sohel Birthday Gift : టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్‌తో ఫుల్ పాపులర్ అయిపోయాడు.. మన సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహైల్.. సినిమాల్లో, సీరియల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్-4 సీజన్ లైఫ్ ఇచ్చింది. హౌజ్‌లో ఉన్నంత కాలం ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. 100 రోజుల పాటు హౌస్‌లో సోహైల్ సందడి చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
సోహైల్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఏప్రీల్ 18న సోహైల్ పుట్టిన రోజు సందర్భంగా అతడి అభిమాని ఒకరు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడంట. సోహైల్‌కు ఖరిదైన స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్ ఇవ్వడంతో సింగరేణి ముద్దుబిడ్డ ఫిదా అయ్యాడు.
అభిమానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోహైల్ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నాడు. బిగ్‌బాస్ అనంతరం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడనే టాక్ వినిపిస్తోంది.