Sivaji : బిగ్‌బాస్ శివాజీ విలన్‌గా.. టాలీవుడ్ నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ.. ఆ హిట్ డైరెక్టర్ మూవీ..

బిగ్‌బాస్ శివాజీ విలన్‌గా టాలీవుడ్ నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఈ మూవీని ఆ హిట్ డైరెక్టర్..

Sivaji : బిగ్‌బాస్ శివాజీ విలన్‌గా.. టాలీవుడ్ నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ.. ఆ హిట్ డైరెక్టర్ మూవీ..

BiggBoss Sivaji as villian in Tollywood producer son debut movie

Updated On : March 23, 2024 / 12:04 PM IST

Sivaji : సినిమా పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన నటులను ఇప్పుడు విలన్స్ గా చూడడం చాలా సాధారణం అయ్యిపోయింది. పాత్రలో బలముంటే అది హీరో రోల్ అయినా, విలన్ రోల్ అయినా చేసేస్తున్నారు. ఈక్రమంలోనే హీరో శివాజీ కూడా విలన్ గా కనిపించబోతున్నారట. సపోర్టింగ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా పలు సినిమాల్లో నటించిన శివాజీ.. ఇటీవల బిగ్‌బాస్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు.

ఆ షో పూర్తి అవ్వగానే ‘#90s’ వెబ్ సిరీస్ తో సూపర్ హిట్టుని అందుకున్నారు. దీంతో ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ కి సైన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో విలనిజం ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట. గతంలో ‘ఇంద్ర’ వంటి సినిమాలో శివాజీని నెగటివ్ పాత్రలో చూశాము. అయితే ఈసారి పూర్తిగా సినిమా మొదలు నుంచి విలనిజంతో కనిపించబోతున్నారట.

Also read : Ajith Kumar : ఫ్రెండ్స్ కోసం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న అజిత్ కుమార్.. వైరల్ అవుతున్న వీడియో..

ఇక ఈ చిత్రాన్ని కొండా విజయ్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఈ దర్శకుడు గతంలో గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు ఓ నిర్మాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ‘అహం’ అనే సినిమాని తీసుకు రాబోతున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారట.

కాగా దర్శకుడు కొండా విజయ్ కుమార్ తన గత రెండు చిత్రాలను లవ్ స్టోరీస్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు ఈ మూవీకి ఏమో ‘అహం’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. మరి ఈ అహం ప్రేమలోనా, కుటుంబంలోనా, స్నేహంలోనా అనేది తెలియాల్సి ఉంది.