Biittiri Satti : పండక్కి కోటి రూపాయల కారు కొన్న బిత్తిరిసత్తి.. స్టార్ సెలబ్రిటీలు వాడే రేంజ్ రోవర్..
తాజాగా దసరా పండగకి ఏకంగా కోటి రూపాయల రేంజ్ రోవర్ కారు కొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు బిత్తిరి సత్తి. పండగ పూట కారుతో, తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో..............

Bithiri Sathi Buys One crore costly Range Rover Car
Biittiri Satti : తెలంగాణ యాసని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ వార్తల్లో కనిపించి పాపులర్ అయ్యాడు బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్. తన సరదా మాటలతో, బిత్తిరి చేష్టలతో బాగా పాపులర్ అయ్యాడు. సినిమాలు, టీవీల్లో కూడా అవకాశాలు సంపాదించి మరింత ఫేమస్ సంపాదించాడు బిత్తిరి సత్తి. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగమవుతున్నాడు. ప్రతి సినిమా యూనిట్ కచ్చితంగా బిత్తిరి సత్తితో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేస్తుంది. స్టార్ హీరోలు కూడా బిత్తిరి సత్తితో ప్రమోషన్ చేయించుకుంటున్నారంటే ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించాడో అర్ధమవుతుంది.
తాజాగా దసరా పండగకి ఏకంగా కోటి రూపాయల రేంజ్ రోవర్ కారు కొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు బిత్తిరి సత్తి. పండగ పూట కారుతో, తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సత్తికి అభినందనలు తెలుపుతున్నారు.
Ahimsa Teaser : అహింస టీజర్ రిలీజ్.. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి హీరో ఎంట్రీ.. తేజ మార్క్ కథేనా??
స్టార్ సెలబ్రిటీలు, బాగా డబున్న వాళ్ళు మాత్రమే వాడే రేంజ్ రోవర్ కారు సాధారణ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా ఉన్న బిత్తిరి సత్తి కొనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రేంజ్ రోవర్ కారు కొన్నాడంటే ఏ రేంజ్ లో సంపాదిస్తున్నాడో అని అంతా లెక్కలు వేసుకుంటున్నారు.