ఆహా యాప్‌లో బ్లాక్‌బస్టర్ ఆగస్ట్!..

  • Published By: sekhar ,Published On : August 13, 2020 / 07:10 PM IST
ఆహా యాప్‌లో బ్లాక్‌బస్టర్ ఆగస్ట్!..

Updated On : August 13, 2020 / 7:49 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓటీటీలవైపే మొగ్గుచూపుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత డిజిటల్ మాధ్యమాలకు మరింత ఆదరణ పెరిగింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆకర్షణీయమైన ప్యాకేజీలతో పలు ఓటీటీలు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్నాయి.

Metro Kathalu ఈ నేపధ్యంలో తొలి తెలుగు ఓటీటీ ఆహా ఇప్పుడు ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. ఇప్పటికే కొత్త కొత్త సినిమాలు, కొత్త కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆహా స్వాతంత్ర్య దినోత్సవం మరియు వినాయకచవితి సందర్భంగా ఈ ఆగస్టు నెలను బ్లాక్‌బస్టర్ ఆగస్ట్‌గా మార్చబోతోంది.

Johar

ఏకంగా పది కొత్త సినిమాలు, పలు ఒరిజినల్స్‌తో ‘ఆహా’ అనిపించనుంది. ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఆగస్టు 14న ‘జోహార్’, ‘మెట్రో కథలు’ రిలీజ్ కానున్నాయి. ఆగస్టు 15న సుమ ‘ఆల్ ఈజ్ వెల్’ ప్రారంభం కానుంది. తొలి తెలుగు ఓటీటీ ఆహా అందించే కొత్త సినిమాలు, ఒరిజినల్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.