LSD Trailer : LSD సిరీస్ ట్రైలర్ చూశారా? బాబోయ్ మరీ ఇంత బోల్డ్.. చివర్లో దిల్ రాజు డైలాగ్స్‌తో రీమిక్స్ సాంగ్..

LSD సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డార్క్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

LSD Trailer : LSD సిరీస్ ట్రైలర్ చూశారా? బాబోయ్ మరీ ఇంత బోల్డ్.. చివర్లో దిల్ రాజు డైలాగ్స్‌తో రీమిక్స్ సాంగ్..

Bold and Suspense Thriller Web Series LSD Trailer Released

Updated On : February 1, 2024 / 6:35 AM IST

LSD Trailer : అనిల్ మోదుగ, శివ కోన నిర్మాణంలో శివ కోన దర్శకుడిగా తెరకెక్కిన వెబ్ సిరీస్ LSD (లవ్, సెక్స్ అండ్ డెత్). ప్రాచీ టకర్, నేహా దేస్పాండె, ప్రభాకర్, కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సిరీస్ కామెడీ మరియు బోల్డ్ అంశాలతో తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ట్రైలర్ మొదట్లో బోల్డ్ సీన్స్ చూపించి ఆ తర్వాత మాస్, కామెడీ అంశాలు కూడా ఉన్నట్టు చూపించారు. గతంలో వారసుడు సినిమా ఈవెంట్లో దిల్ రాజు చెప్పిన.. డ్యాన్స్ వేనుమా డ్యాన్స్ ఇరుక్కు.. ఫైట్స్ వేనుమా ఫైట్స్ ఇరుక్కు.. అనే డైలాగ్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ డైలాగ్ ని ఒక రీమిక్స్ సాంగ్ లా చివర్లో చూపించారు.

Also Read : Arbaaz Khan : మళ్ళీ తెలుగులోకి సల్మాన్ ఖాన్ తమ్ముడు.. ఏడేళ్ల తర్వాత.. ఏ సినిమాలోనో తెలుసా?

మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, వారి ఫారెస్ట్‌ ట్రిప్‌ లో థ్రిల్లింగ్ అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ LSD సిరీస్ తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఫిబ్రవరి 2న MX ప్లేయర్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డార్క్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.