Arbaaz Khan : మళ్ళీ తెలుగులోకి సల్మాన్ ఖాన్ తమ్ముడు.. ఏడేళ్ల తర్వాత.. ఏ సినిమాలోనో తెలుసా?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడిగా, నటుడిగా అర్బాజ్ ఖాన్ కూడా అందరికి పరిచయమే. ఏడేళ్ల తర్వాత మరో తెలుగు సినిమాతో రాబోతున్నాడు.

Arbaaz Khan : మళ్ళీ తెలుగులోకి సల్మాన్ ఖాన్ తమ్ముడు.. ఏడేళ్ల తర్వాత.. ఏ సినిమాలోనో తెలుసా?

Salman Khan Brother Arbaaz Khan Re entry in Telugu after seven years with Ashwin Babu Movie

Updated On : February 1, 2024 / 6:17 AM IST

Arbaaz Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడిగా, నటుడిగా అర్బాజ్ ఖాన్ కూడా అందరికి పరిచయమే. రెగ్యులర్ గా హిందీ సినిమాలు చేసే అర్బాజ్ ఖాన్ అప్పుడప్పుడు సౌత్ సినిమాల్లో కూడా కనిపిస్తాడు. గతంలో జై చిరంజీవ, కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అర్బాజ్ ఖాన్ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మరో తెలుగు సినిమాతో రాబోతున్నాడు.

మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా తెరకెక్కుతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్ పోలీసాఫీసర్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Also Read : Double iSmart : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలా రియల్ లైఫ్‌లో బ్రెయిన్ ఆపరేషన్.. పూరీ విజన్ అంటూ మీమ్స్..

చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటించడంపై అర్బాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అశ్విన్ బాబు హీరోగా ఒక కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. మా గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఇందులో అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. నేటి నుంచి మొదలైన కొత్త షెడ్యూల్ లో ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టారు. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు. ఇక గత సంవత్సరమే అర్బాజ్ ఖాన్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు.