Double iSmart : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలా రియల్ లైఫ్‌లో బ్రెయిన్ ఆపరేషన్.. పూరీ విజన్ అంటూ మీమ్స్..

'ఇస్మార్ట్ శంకర్' సినిమాలా రియల్ లైఫ్‌లో కూడా బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ గురించి ఎలాన్ మస్క్ ట్వీట్ చేయగా, టాలీవుడ్ ఫ్యాన్స్.. పూరీ విజన్ అంటూ మీమ్స్ చేస్తున్నారు.

Double iSmart : ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలా రియల్ లైఫ్‌లో బ్రెయిన్ ఆపరేషన్.. పూరీ విజన్ అంటూ మీమ్స్..

Elon Musk introduce first computer chip human like Ram Pothineni ismart shankar

Updated On : January 31, 2024 / 8:46 PM IST

Double iSmart : పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. 2019లో రిలీజయ్యి సూపర్ హిట్ అయిన ఆ సినిమాకి.. ఇప్పుడు ‘డబల్ ఇస్మార్ట్’ అంటూ సీక్వెల్ ని కూడా తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో జరిగినట్లుగా రియల్ లైఫ్ లో కూడా జరిగిందట.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్‌ హీరోగా నటించగా, సత్యదేవ్ సెకండ్ హీరోగా కనిపించారు. మూవీలో సత్యదేవ్ చనిపోతే.. అతని బ్రెయిన్ లోని ఆలోచనలను ఆపరేషన్ చేసి రామ్ కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ తరువాత రామ్, సత్యదేవ్ ఆలోచనలతో అతడిలా మారిపోతుంటాడు. ఇప్పుడు అలాంటి ఆపరేషన్ ని రియల్ లైఫ్ లో కూడా చేశారట. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ఎలాన్ మస్క్ స్థాపించిన ‘న్యూరాలింక్’.. ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ చిప్ బ్రెయిన్ కలిగిన వ్యక్తిని అందరికి పరిచయం చేయబోతుంది. మనిషి బ్రెయిన్ లో కంప్యూటర్ చిప్‌ని ఇంప్లాంట్ చేసే ఆపరేషన్‌ని.. న్యూరోలింక్ ప్రయత్నించి సక్సెస్ అయ్యినట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు, వస్తున్న రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నట్లు పేర్కొన్నారు.

Also read : Nandi Awards : నంది అవార్డు పేరు మార్పు.. ఇక నుంచి తెలంగాణలో ఆ పేరుతో పురస్కారం..

ఇక ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చూసిన మన తెలుగు ఆడియన్స్.. ఇది మా రామ్ అండ్ పూరిజగన్నాథ్ ఎప్పుడో చేసేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఆ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి రికవరీ అయిన తరువాత రియాక్షన్స్ ఏంటో తెలియజేస్తూ.. మూవీలోని సీన్స్ షేర్ చేస్తున్నారు. ఈక్రమంలోనే కొంతమంది మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.