నటుడు భూపేష్ పాండ్యా కన్నుమూత

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 11:23 AM IST
నటుడు భూపేష్ పాండ్యా కన్నుమూత

Updated On : September 24, 2020 / 12:05 PM IST

Bhupesh Pandya passes away: బాలీవుడ్ నటుడు భూపేష్ పాండ్యా ఊపిరితిత్తుల కేన్సరుతో కన్నుమూశారు. నేషనల్ స్కూలు ఆఫ్ డ్రామా (NSD) పూర్వ విద్యార్థి అయిన భూపేష్ పాండ్యా గత కొంత కాలంగా ఊపిరితిత్తుల కేన్సరుతో బాధపడుతున్నారు.


ఆయుష్మాన్ ఖురానా తొలిచిత్రం ‘విక్కీ డోనర్’ తో మంచి పేరు తెచ్చుకున్న భూపేష్ పాండ్యా మృతి పట్ల బాలీవుడ్ నటులు ప్రగాఢ సంతాపం తెలిపారు. భూపేష్ పాండ్యా 4వ దశ ఊపిరితిత్తుల కేన్సరుతో బాధపడుతుండటంతో అతనికి చికిత్స చేయించేందుకు నటులు మనోజ్ బాయ్ పేయి, గజరాజ్ రావు, రాజేష్ తైలాంగ్ లు గతంలో నిధులు సేకరించారు.


భూపేష్ పాండ్యా ‘హజరోన్ ఖ్వాహిషెయిన్ ఐసీ, వెబ్ సిరీస్, ఢిల్లీ క్రైం, గాంధీ టు హిట్లర్, ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ వంటి ప్రాజెక్టుల్లో పనిచేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వరుస మరణాలు సంభవించడంతో చిత్ర పరిశ్రమలో ఆందోళన నెలకొంది.