Ruchi Gujjar : ‘కాన్స్ ఫిలిం ఫెస్టివల్’లో ‘నరేంద్రమోదీ’ నక్లెస్ వేసుకున్న నటి.. వైరల్ అవుతున్న మోదీ లాకెట్ నక్లెస్..

బాలీవుడ్ కి చెందిన నటి రుచి గుజ్జర్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో వేసుకున్న మోదీ నక్లెస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Ruchi Gujjar : ‘కాన్స్ ఫిలిం ఫెస్టివల్’లో ‘నరేంద్రమోదీ’ నక్లెస్ వేసుకున్న నటి.. వైరల్ అవుతున్న మోదీ లాకెట్ నక్లెస్..

Ruchi Gujjar Wears Narendra Modi Necklace in Cannes Film Festival 2025

Updated On : May 20, 2025 / 8:12 PM IST

Ruchi Gujjar : ప్రస్తుతం పారిస్ లో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల నుంచి అనేకమంది సినీ పరిశ్రమ వ్యక్తులు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వ్యక్తులు వచ్చి సందడి చేస్తారు, సినిమాలు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఫ్యాషన్స్ కి అడ్డా. అక్కడికి వచ్చే వాళ్లంతా కొత్త రకం డ్రెస్సులతో అలరిస్తారు. వెరైటీ, వెరైటీ డ్రెస్సులతో అబ్బురపరుస్తారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియా నుంచి కూడా చాలా మంది పాల్గొంటారు.

తాజాగా బాలీవుడ్ కి చెందిన నటి రుచి గుజ్జర్ వేసుకున్న మోదీ నక్లెస్ ఇప్పుడు వైరల్ గా మారింది. నేడు కాన్స్ కి హాజరయిన వారికి స్పెషల్ గా డిన్నర్ అరేంజ్ చేసారు. ఈ డిన్నర్ పార్టీకి రుచి గుజ్జర్ ఓ లెహంగా డ్రెస్ వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూనే మెడలో ఓ భారీ నక్లెస్ వేసుకుంది. ఈ నక్లెస్ కి నరేంద్రమోదీ ఫొటోలు ఉన్న లాకెట్స్ తగిలించారు. బీజీపీ గుర్తు అయిన కమలం పువ్వులో మోదీ ఫోటో ఉన్న మూడు లాకెట్స్ ని తన నక్లెస్ కి తగిలించుకుంది రుచి గుజ్జర్. దీంతో రుచి వేసుకున్న నక్లెస్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. కాన్స్ లో ఇప్పుడు ఈ నక్లెస్ వైరల్ గా మారింది. ఇక రుచి వేసుకొచ్చిన ఈ లెహంగా, నక్లెస్ డిజైనర్ రూప శర్మ డిజైన్ చేసినట్టు సమాచారం.

Also Read : Arya 3 : బన్నీ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. ‘ఆర్య 3’ టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు.. పాన్ ఇండియా టైంలో లవ్ స్టోరీ?

అయితే ఈ మోదీ నక్లెస్ గురించి రుచి గుజ్జర్ మాట్లాడుతూ.. ఈ డ్రెస్ మా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేసుకున్నాను. ఈ నక్లెస్ కేవలం జ్యువెల్లరీ మాత్రమే కాదు. ఇది ధైర్యం, ముందు చూపు, ఇండియా ప్రపంచ వేదికలపై ముందుకు వెళ్తుంది అని గుర్తు. ఇది కాన్స్ లో వేసుకోవడంతో నేను మా ప్రధానమంత్రికి గౌరవం ఇస్తున్నాను. ఆయన సారథ్యంలో ఇండియా కొత్త తీరాలకు దూసుకెళ్తుంది అని తెలిపింది. మొత్తానికి ఒక్క మోదీ నక్లెస్ తో రుచి గుజ్జర్ కాన్స్ లో వైరల్ గా మారింది. రుచి కూడా ఈ డ్రెస్ లో తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Ruchi Gujjar

రుచి గుజ్జర్ ఎవరంటే..

రుచి గుజ్జర్ రాజస్థాన్ కి చెందిన అమ్మాయి. జైపూర్ లో కాలేజీ పూర్తి చేసి మోడలింగ్ రంగంవైపుకు వెళ్ళింది. 2023 లో మిస్ హర్యానా గా నిలిచింది రుచి గుజ్జర్. ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ లో పలు ప్రైవేట్ వీడియో సాంగ్స్ లో నటించింది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ గుర్తింపు ఉన్న పాత్రల కోసం చూస్తుంది. మరి ఈ మోదీ నక్లెస్ తో వైరల్ అయిన తర్వాత రుచి గుజ్జర్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.

 

Also Read : Jr NTR : ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే.. బర్త్ డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్..