Arya 3 : బన్నీ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. ‘ఆర్య 3’ టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు.. పాన్ ఇండియా టైంలో లవ్ స్టోరీ?

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Arya 3 : బన్నీ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్.. ‘ఆర్య 3’ టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు.. పాన్ ఇండియా టైంలో లవ్ స్టోరీ?

Dil Raju Registered Arya 3 Movie Title Allu Arjun and Sukumar Will do a Love Story

Updated On : May 20, 2025 / 8:03 PM IST

Arya 3 : అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా బాహుబలి రికార్డులు సైతం బద్దలు కొట్టి పాన్ ఇండియా వైడ్, విదేశాల్లో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. బన్నీ ఇప్పుడు ఉన్న రేంజ్ కి అన్ని పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అట్లీ తర్వాత త్రివిక్రమ్ తో, సందీప్ వంగతో, పుష్ప 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర సమాచారం వైరల్ గా మారింది. అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్, సుకుమార్ కెరీర్లో మొదటి సినిమా ఆర్య. ఈ సినిమా సుకుమార్, అల్లు అర్జున్ జీవితాల్ని మార్చేసింది. అప్పట్నుంచి వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. ఆర్య మంచి క్లాసిక్ లవ్ స్టోరీలా మిగిలింది. దానికి సీక్వెల్ గా ఆర్య 2 కూడా తీయగా అది పర్వాలేదనిపించింది. గత సంవత్సరం ఆర్య 20 ఏళ్ళ వేడుక కూడా గ్రాండ్ గా చేసారు.

Also Read : Jr NTR : ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే.. బర్త్ డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్..

అయితే తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం దిల్ రాజు ఆర్య 3 టైటిల్ ని రిజిస్టర్ చేయించాడట. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించారని సమాచారం. ఓ సీనియర్ పీఆర్వో కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలిపాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ ఆర్య 3 సినిమా చేస్తాడా? పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ లవ్ స్టోరీ చేస్తాడా? సుకుమార్ పుష్ప 3 కాకుండా ఆర్య 3 చేస్తాడా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.

ఇక కొంతమంది అయితే సుకుమార్ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ తో వేరే హీరోతో ఆర్య 3 తీస్తారేమో, దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా చేస్తాడేమో అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆర్య 3 అని సరదాగా అన్నారు తప్ప ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు ఎప్పుడూ. కానీ సడెన్ గా దిల్ రాజు ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించడంతో టాలీవుడ్ లో, ఫ్యాన్స్ లో ఈ టైటిల్ చర్చగా మారింది. అయితే మరికొందరు టాలీవుడ్ మీడియా జనాలు ఎవరైనా ఆర్య 3 టైటిల్ పెట్టి ఏదైనా సినిమా చేసి ఆ టైటిల్ కి బ్యాడ్ నేమ్ తెస్తారేమో అని ఆ టైటిల్ మన దగ్గరే ఉంటే బెటర్ అని దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లు అనుకుంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో దిల్ రాజుకే తెలియాలి.

Also Read : Rana Naidu 2 : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి స్ట్రీమింగ్? ఈసారి ఎంత బూతు చూపిస్తారో..?