Rana Naidu 2 : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి స్ట్రీమింగ్? ఈసారి ఎంత బూతు చూపిస్తారో..?

తాజాగా రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించారు.

Rana Naidu 2 : ‘రానా నాయుడు’ సీజన్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పట్నించి స్ట్రీమింగ్? ఈసారి ఎంత బూతు చూపిస్తారో..?

Rana Venkatesh Netflix Web Series Rana Naidu Season 2 Streaming Date Announced

Updated On : May 20, 2025 / 4:43 PM IST

Rana Naidu 2 : వెంకటేష్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్స్ లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయింది. బాబాయ్ – అబ్బాయి కలిసి చేస్తుండటంతో అందరూ ఈ సిరీస్ పై ఆసక్తి చూపించారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక సిరీస్ చూస్తే మొత్తం బూతులు, అడల్ట్ సీన్స్, వైల్డ్ కంటెంట్ ఉండటంతో వెంకిమామ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు వెంకటేష్ ఇలాంటి సిరీస్ చేసారా అని అంతా షాక్ అయ్యారు.

రానా నాయుడులో ఉన్న అడల్ట్ కంటెంట్ తో వైరల్ అవ్వడమే కాక వివాదాల్లో కూడా నిలిచింది. పలువురు తెలుగు సెలబ్రిటీలు కూడా ఇదొక బూతు సిరీస్ అని కామెంట్స్ చేసారు. అయితే వెంకటేష్, రానా, నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇదేమి పట్టించుకోకుండా అప్పుడే సీజన్ 2 కూడా అనౌన్స్ చేసింది. ఇప్పటికే సీజన్ 2 టీజర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా రానా నాయుడు సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించారు. రానా నాయుడు సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు రానా అధికారికంగా ప్రకటించాడు.

Rana Naidu

Also Read : NTR Remuneration : ‘వార్ 2’ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? బాలీవుడ్ లో చర్చగా ఎన్టీఆర్ రెమ్యునరేషన్..

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. రానా నాయుడు సిరీస్ లోనే బోల్డంత అడల్ట్ కంటెంట్ ఉంది. ఇక ఈ సీజన్ 2 లో ఇంకెంత అడల్ట్ కంటెంట్, బూతులు చూపిస్తారో అని పలువురు విమర్శలు చేస్తుంటే సిరీస్ నచ్చిన ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు మాత్రం రానా నాయుడు 2 సిరీస్ కోసం వెయిటింగ్ అంటున్నారు.

 

Also See : Abhinaya : భర్తతో కలిసి లండన్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న నటి.. ఫొటోలు వైరల్..