NTR Remuneration : ‘వార్ 2’ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? బాలీవుడ్ లో చర్చగా ఎన్టీఆర్ రెమ్యునరేషన్..
వార్ 2 టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.

War 2 Teaser Released NTR Remuneration Discussions in Bollywood
NTR Remuneration : ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. దేవర కూడా మంచి విజయమే అందుకుంది. ఎన్టీఆర్ ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దేవర తర్వాత వార్ 2 సినిమాతో రాబోతున్నాడు ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్ 2 టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే వార్ 2 టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమాలో హృతిక్ కి ఎన్టీఆర్ గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అని సమాచారం. ఈ క్రమంలో వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ బాలీవుడ్ లో చర్చగా మారింది. ఎన్టీఆర్ RRR సినిమాకు 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఆ తర్వాత వచ్చిన దేవరకు కూడా 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని, తన సొంత నిర్మాణ సంస్థే కావడంతో 10 కోట్ల వరకు ప్రాఫిట్స్ లో తీసుకున్నాడని టాక్.
అయితే బాలీవుడ్ లో ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు ఏకంగా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా అంటుంది. ఒక సౌత్ హీరో బాలీవుడ్ కి వచ్చి బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్స్ లో ఒకరిగా నటిస్తూ 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలాగో ఎన్టీఆర్ 45 కోట్లు తీసుకుంటున్నాడు. బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువే ఉంటాయి, ఎన్టీఆర్ కి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ కూడా ఉంది కాబట్టి 60 కోట్లు ఇవ్వడంలో తప్పులేదు అంటున్నారు ఫ్యాన్స్.
టాలీవుడ్ లో ఇప్పటివరకు అల్లు అర్జున్, ప్రభాస్ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్స్ తీసుకున్నారు. మహేష్ ఇప్పుడు రాజమౌళి సినిమాతో తీసుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ 70 కోట్ల వరకు హరిహర వీరమల్లు సినిమాకు తీసుకున్నాడని టాక్. ఇప్పుడు ఈ భారీ రెమ్యునరేషన్ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా 60 కోట్లతో చేరిపోయాడు. అది కూడా బాలీవుడ్ లో తీసుకోవడం గ్రేట్ అంటున్నారు.
Also Read : War 2 : ‘వార్ 2’ టీజర్ రివ్యూ.. ఎన్టీఆర్ – హృతిక్ మధ్య యుద్ధమే.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో సెటిల్ అవుతాడా?