Kiara Advani : ఎన్టీఆర్ సినిమా కోసం మొదటిసారి బికినీ వేసిన ‘కియారా అద్వానీ’.. ఫస్ట్ టైం అంటూ కియారా స్పెషల్ పోస్ట్..
టీజర్ లో కియారా అద్వానీ బికినీ వేసుకున్న షాట్ కూడా చూపించారు.

Kiara Advani Special Post on NTR Hrithik Roshan War 2 Teaser
Kiara Advani : బాలీవుడ్ భామ కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాలతో మెప్పించింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. కొన్నాళ్ల క్రితం కియారా హీరో సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కియారా ప్రగ్నెంట్ కూడా. అయితే తాజాగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మెయిన్ లీడ్స్ లో నటించిన వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
టీజర్ లో కియారా అద్వానీ బికినీ వేసుకున్న షాట్ కూడా చూపించారు. దీంతో సినిమాలో కియారా అందాల ఆరబోత ఎక్కువగానే ఉండనుందని తెలుస్తుంది. అయితే వార్ 2 టీజర్ గురించి కియారా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
Also Read : Ambika Krishna : సినిమా థియేటర్స్ బంద్ కి పెద్ద హీరోలే కారణం.. ఒప్పుకోకపోతే థియేటర్స్ బంద్..
వార్ 2 టీజర్ షేర్ చేసి.. ఈ సినిమాలో చాలా ఫస్ట్ లు ఉన్నాయి. ఫస్ట్ YRF ఫిలిం, ఫస్ట్ యాక్షన్ ఫిలిం, ఈ ఇద్దరి హీరోలతో నటించడం ఫస్ట్ టైం, డైరెక్టర్ అయాన్ తో ఫస్ట్ టైం కలిసి పనిచేస్తున్నాను, అలాగే ఫస్ట్ టైం సినిమాలో బికినీ వేసుకున్నాను, నా ఫస్ట్ బికినీ షాట్ అని రాసుకొచ్చింది. దీంతో కియారా పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ – హృతిక్ సినిమాలో కియారా మొదటిసారి బికినీ వేయడంతో బాలీవుడ్ లో చర్చగా మారింది. అది కూడా పెళ్లయ్యాక కియారా బికినీ వేయడంతో మరింత వైరల్ అవుతుంది.
ఇక కియారా ఫ్యాన్స్ టీజర్ లో వచ్చిన బికినీ షాట్స్ ని వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా హృతిక్ కి జంటగా, రా ఏజెంట్ గా కనిపించబోతుంది అని తెలుస్తుంది. షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసినా కియారా ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు బికినీ షాట్స్ రావడంతో మరింత వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also See : Nidhhi Agerwal : ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ లో చీరలో మెరిపించిన నిధి అగర్వాల్..
Also Read : War 2 : ‘వార్ 2’ టీజర్ రివ్యూ.. ఎన్టీఆర్ – హృతిక్ మధ్య యుద్ధమే.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో సెటిల్ అవుతాడా?