Ambika Krishna : సినిమా థియేటర్స్ బంద్ కి పెద్ద హీరోలే కారణం.. ఒప్పుకోకపోతే థియేటర్స్ బంద్..
గత కొన్ని రోజులుగా నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వివాదం నడుస్తుంది.

Ambika Krishna Sensational Comments on Tollywood Heros and Theaters Bundh
Ambika Krishna : ప్రస్తుతం థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అందులోను సింగిల్ థియేటర్స్ కి జనాలే వెళ్లట్లేదు. దీంతో థియేటర్స్, థియేటర్ ఓనర్లు సమస్యల్లో ఉన్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వివాదం నడుస్తుంది. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా రెంట్ విధానంలో కాకుండా పర్శంటేజ్ విధానంలో డబ్బులు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయంలో పై టాలీవుడ్ నిర్మాతలతో మీటింగ్స్ జరిగాయి. కొంతమంది నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ జూన్ 1 నుంచి బంద్ చేస్తామని ప్రకటించారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, మాజీ నిర్మాత, ఎగ్జిబిటర్ అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Also Read : War 2 : ‘వార్ 2’ టీజర్ రివ్యూ.. ఎన్టీఆర్ – హృతిక్ మధ్య యుద్ధమే.. ఎన్టీఆర్ బాలీవుడ్ లో సెటిల్ అవుతాడా?
అంబికా కృష్ణ మాట్లాడుతూ.. సినిమా ధియేటర్స్ మూత పడటానికి పెద్ద హీరోలే కారణం. పెద్ద హీరోల సినిమాలు తక్కువగా రావటం వల్లే థియేటర్స్ ఖాళీగా ఉండటంతో మూసేయాల్సిన పరిస్థితితులు వస్తున్నాయి. పెద్ద హీరోలు రెగ్యులర్ గా సినిమాలు చేస్తే జనాలు థియేటర్స్ కి వస్తారు. చిన్న సినిమాలు హిట్ అయితేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు లేకపోతే రావట్లేదు. పాత పద్ధతిలోనే థియేటర్లకు పర్సెంటేజీ ప్రాతిపదికన అమలు చేస్తేనే ఎగ్జిబిటర్స్ బతికి బట్టకట్టగలుగుతారు. థియేటర్ల యాజమాన్యాల సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సమస్యలు పరిష్కారం కాకపోతే, డిమాండ్స్ కి ఒప్పుకోకపోతే జూన్ 1వ తేదీ నుండి థియేటర్స్ మూతపడటం ఖాయం అని అన్నారు.
మరి ఇప్పటికే బంద్ ఫిక్స్ అవ్వగా టాలీవుడ్ నిర్మాతలు ఏం చేస్తారో, తాజాగా అంబికా కృష్ణ వ్యాఖ్యలపై ఎవరైనా నిర్మాతలు స్పందిస్తారా చూడాలి. అయితే అంబికా కృష్ణ చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ అని, పెద్ద హీరోల సినిమాలకే థియేటర్స్ కి జనాలు వెళ్తున్నారని, పెద్ద హీరోలు మాత్రం ఒక్క సినిమా కోసం సంవత్సరాలు తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.