Pawan Kalyan : అడిగి మరీ ‘ఆస్కార్ అవార్డు’ చూసిన పవన్ కళ్యాణ్.. కీరవాణికి పవన్ అంటే ఎంత అభిమానమో.. పవన్ సరదాగా ఉన్న ఈ వీడియో చూశారా?

పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు.

Pawan Kalyan : అడిగి మరీ ‘ఆస్కార్ అవార్డు’ చూసిన పవన్ కళ్యాణ్.. కీరవాణికి పవన్ అంటే ఎంత అభిమానమో.. పవన్ సరదాగా ఉన్న ఈ వీడియో చూశారా?

Pawan Kalyan Meets HariHara VeeraMallu Music Director MM Keeravani and Watch Oscar Award

Updated On : May 20, 2025 / 12:44 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయడంతో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రేపు హరిహర వీరమల్లు సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు.

కీరవాణి రేపు రిలీజయ్యే సాంగ్ ని పవన్ కళ్యాణ్ కి వినిపించారు. ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అనే పాటని వినిపించారు కీరవాణి. ఆ పాట విని.. పౌరుషం తక్కువైతే ఎవరైనా ఈ పాట వింటే పౌరుషం వస్తుంది అని చెప్పి కీరవాణి మ్యూజిక్ ని అభినందించారు పవన్. అనంతరం కీరవాణి పవన్ కల్యాణపై తనకున్న అభిమానాన్ని చూపించారు.

Also See : Pawan Kalyan : కీరవాణిని కలిసి సన్మానించిన పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ మ్యూజిక్ సిట్టింగ్స్.. వీడియో వైరల్..

కీరవాణి.. మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా అని అన్నారు. అలాగే సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి పవన్ కి తెలిపారు. కీరవాణి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకున్నారు పవన్, కీరవాణి. పవన్ వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నారు.

అలాగే కీరవాణి.. తనకు నచ్చిన 32 కథలను ఒక పుస్తకంలో భద్రపరుచుకోగా ఆ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కి బహుకరించారు. దీంతో పవన్ సంతోషించారు. కీరవాణి RRR లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంతో పవన్ ఆస్కార్ అవార్డు చూపించమని అడిగి దాన్ని పట్టుకొని చూసారు. ఈ వీడియో అంతా పవన్ సరదాగా ఉండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

 

Also Read : Raashii Khanna : షూటింగ్ లో రాశిఖన్నాకు ప్రమాదం.. .ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..