Raashii Khanna : షూటింగ్ లో రాశిఖన్నాకు ప్రమాదం.. .ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..
తాజాగా రాశిఖన్నా తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Raashii Khanna Injured in Movie Shooting Shares Photos
Raashii Khanna : హీరోయిన్ రాశిఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసి మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం తెలుగులో తగ్గించినా హిందీ, తమిళ్ లో సినిమాలు చేస్తుంది రాశిఖన్నా. తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో ఓ సినిమా, ఓ సిరీస్ లో నటిస్తుంది.
తాజాగా రాశిఖన్నా తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : War 2 teaser : ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్.. వార్ 2 టీజర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్..
రాశిఖన్నా షూటింగ్ లో తనకు గాయాలయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొన్ని రోల్స్ అడగవు, అవి డిమాండ్ చేస్తాయి. మీ శరీరం, మీ శ్వాస, మీ గాయాలు, మీరు తుఫానుగా మారినప్పుడు, ఉరుములకు కదలరు. త్వరలో రానుంది అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలలో తన ముక్కు నుంచి రక్తం కారుతుంది. కాళ్లకు, చేతులకు కూడా గాయాలు అయి రక్తం కారుతున్నాయి. ఇది ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో జరిగినట్టు తెలుస్తుంది. దీంతో రాశిఖన్నా త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
Also Read : Sai Dhanshika – Vishal : పెళ్లి చేసుకోబోతున్న సినీ జంట.. విశాల్ – సాయి ధన్సిక క్యూట్ ఫొటోలు వైరల్..