Jr NTR : ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే.. బర్త్ డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్..
తాజాగా ఎన్టీఆర్ తన పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్తున్న అందరికి థ్యాంక్స్ చెప్తూ ఓ ఆసక్తికర పోస్ట్ చేసారు.

Jr NTR heartfelt Post on his Birthday after War 2 Teaser Released
Jr NTR : నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఎన్టీఆర్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యమదొంగ సినిమా రీ రిలీజ్ అవ్వడంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
తాజాగా ఎన్టీఆర్ తన పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్తున్న అందరికి థ్యాంక్స్ చెప్తూ ఓ ఆసక్తికర పోస్ట్ చేసారు.
ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో.. కొన్నిసార్లు నేను ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్న ప్రతిసారీ మొదట గుర్తుకు వచ్చేది మీరే. ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు, నాకు శుభాకాంక్షలు చెప్తున్నందుకు నా అభిమానులకు ధన్యవాదాలు. వార్ 2 టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆగస్టు 14న మీరు ఆ సినిమాని చూడటానికి నేను వెయిట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నా శ్రేయోభిలాషులు, మీడియా, సినీ పరిశ్రమలోని వాళ్లకు అందరికి ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన పోస్ట్ వైరల్ గా మారింది.
Thank you. pic.twitter.com/62BsFWHKHP
— Jr NTR (@tarak9999) May 20, 2025