Drugs case Bollywood : సారా ఆలీఖాన్, రకూల్ ప్రీత్ సింగ్ ? NCB విచారణలో రియా వెల్లడి ?

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ప్రకంపనలు రేకేత్తిస్తోంది. డ్రగ్స్ వైపు మళ్లడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నటి రియా చక్రవర్తిని ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
14 రోజుల పాటు కస్టడీలో ఉన్న రియాను Narcotics Control Bureau (NCB) విచారిస్తోంది. ఈ విచారణలో దాదాపు 25 మంది బాలీవుడ్ కు సంబంధించిన పేర్లు చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. ఓ జాతీయ టెలివిజన్ ఛానెల్ ముగ్గురు పేర్లను బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
సారా ఆలీఖాన్, రకూల్ ప్రీత్ సింగ్, సైమాన్ ఖంబట్టా ఉన్నట్లు కథనం. రియాతో వీరిద్దరి నటులకు మంచి ఫ్రెండ్స్ షిప్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో రకూల్, సారా స్పందించాల్సి ఉంది. వచ్చిన కథాలను ఖండిస్తారా ? లేక ఇతర విషయాలు చెబుతారా అనే ఉత్కంఠ నెలకొంది. రియా చక్రవర్తి కాల్ లిస్టులో రకూల్, ఇతర నటుల పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో మృతి చెందాడు. అప్పటి నుంచి.. ఈ కేసు అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టే ప్రధానంగా తిరుగుతోంది. ఇందులో.. ప్రధాన నిందితురాలిగా కొనసాగుతోంది. ముఖ్యంగా సుశాంత్ కుటుంబం అతని ప్రేమికురాలు రియా చక్రవర్తి మీదే ఆరోపణలు చేస్తోంది.
ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం తెలపగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. సుశాంత్ మృతి కేసుపై సీబీఐ విచారణకు బీహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు బీహార్ సీఎం సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.
సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం(ఆగస్టు 19,2020) అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలిపింది. సేకరించిన ఆధారాలను, కేసు పత్రాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
సుశాంత్ సింగ్ మృతి చెందిన్నప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించిన విషయం తెలిసిందే.
https://10tv.in/sushant-singh-rajputs-niece-mallika-slams-lakshmi-manchus-defence-of-rhea-chakraborty/
అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. విచారణలో ఆమె బాలీవుడ్‌లో డ్రగ్స్ మత్తులో మునిగితేలే 25 మంది ప్రముఖుల పేర్లు కూడా వెల్లడించింది.
రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్‌సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు.