Urfi Javed : ఉర్ఫి జావేద్ సిస్టర్స్ ని చూశారా? అందరూ ఉర్ఫిలాగే..

రోజుకోరకం డ్రెస్ తో తన అందాలు ప్రదర్శిస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఉర్ఫీ జావేద్.

Urfi Javed : ఉర్ఫి జావేద్ సిస్టర్స్ ని చూశారా? అందరూ ఉర్ఫిలాగే..

Bollywood Fame Urfi Javed with her Sisters Video goes Viral

Updated On : May 19, 2024 / 1:34 PM IST

Urfi Javed : సోషల్ మీడియాలో పాపులారిటీతో హిందీ బిగ్‌బాస్(Bigg Boss)లో పాల్గొని బాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది ఉర్ఫీ జావేద్. ఆ తర్వాత ఉర్ఫీ జావేద్ తన విచిత్ర వస్త్రధారణతో మరింత వైరల్ అయింది. రోజుకోరకం డ్రెస్ తో, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు తయారుచేసుకొని వేసుకొని ఆ డ్రెస్సుల్లో తన అందాలు ప్రదర్శిస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది ఉర్ఫీ జావేద్. ఒక్కోసారి అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకొని మిగతా శరీరం అంతా కనపడేలా బోల్డ్ గా బట్టలు వేసి రోడ్ల మీదకొచ్చి హడావిడి చేస్తుంది. దీంతో ఉర్ఫీ జావేద్ కు పేరు రావడంతో పాటు పలు వివాదాల్లో కూడా నిలిచింది.

Also Read : Vijay – Anand : విజయ్ దేవరకొండతో మల్టీస్టారర్ పై ఆనంద్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్.. ఆల్రెడీ చేశారంట..

ఉర్ఫీ జావేద్ కి ముగ్గురు సిస్టర్స్, ఒక తమ్ముడు ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు ఉర్ఫీ జావేద్ తన సిస్టర్స్, బ్రదర్ తో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఉర్ఫీ జావేద్ సిస్టర్స్ పేర్లు డాలి జావేద్, అస్ఫి జావేద్, ఉరుసు జావేద్. వీరిలో డాలి, అస్ఫి జావేద్ లు కూడా సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అవుతున్నారు. వీరందరిలో ఉర్ఫినే పెద్దది అని తెలుస్తుంది. ఉర్ఫి బాటలోనే మిగిలిన ముగ్గురు సిస్టర్స్ కూడా మోడ్రన్ డ్రెస్సుల్లో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ వైరల్ అవుతున్నారు.

ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి నలుగురు అక్కాచెల్లెళ్లు కలిసి వచ్చారు. ఉర్ఫి జావేద్ తో కలిసి మిగిలిన ముగ్గురు సిస్టర్స్ ఫోటోలకు పోజులు ఇచ్చారు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మొదటిసారి ఈ నలుగురిని చూసిన వాళ్ళు కొంచెం ఆల్మోస్ట్ అందరూ ఒకేలా ఉన్నారు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫి లాగే ఆమె సిస్టర్స్ కూడా మోడ్రన్ డ్రెస్సుల్లో తమ అందాలని ఆరబోస్తున్నారు.