Kartik Aryan : నా కుక్క ఇచ్చే అన్‌కండీషనల్ లవ్ ఏ అమ్మాయి ఇవ్వలేదు.. బాలీవుడ్ స్టార్ హీరో వాలెంటైన్స్ డే వ్యాఖ్యలు..

ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ షెహజాదా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ప్రేమ గురించి మాట్లాడాడు. మంగళవారం నాడు వాలెంటైన్స్ డే కావడంతో పలువురు మీడియా ప్రతినిధులు కార్తీక్ ఆర్యన్ ని ప్రేమ గురించి అడిగారు. దీనిపై కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.............

Kartik Aryan : నా కుక్క ఇచ్చే అన్‌కండీషనల్ లవ్ ఏ అమ్మాయి ఇవ్వలేదు.. బాలీవుడ్ స్టార్ హీరో వాలెంటైన్స్ డే వ్యాఖ్యలు..

Bollywood hero Kartik Aryan said no girl can love him like his dog katori

Updated On : February 15, 2023 / 3:02 PM IST

Kartik Aryan :  బాలీవుడ్ లో చిన్న సినిమాలతో మొదలుపెట్టి భారీ సినిమాలు తీస్తూ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు కార్తీక్ ఆర్యన్. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో అతనికి అభిమానులు చాలా ఎక్కువ. ఇటీవలే భూల్ భూలయ్య 2 సినిమాతో భారీ హిట్ కొట్టిన కార్తీక్ ఆర్యన్ త్వరలో షెహజాదా సినిమాతో రానున్నాడు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ షెహజాదా సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ షెహజాదా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ప్రేమ గురించి మాట్లాడాడు. మంగళవారం నాడు వాలెంటైన్స్ డే కావడంతో పలువురు మీడియా ప్రతినిధులు కార్తీక్ ఆర్యన్ ని ప్రేమ గురించి అడిగారు. దీనిపై కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను నా కుక్క కటోరితో మాత్రమే ప్రేమలో ఉన్నాను. నా కుక్కలాగా అన్ కండీషనల్ గా ప్రేమించేవాళ్ళు నాకు కావాలి. అలా ప్రేమించే అమ్మాయిలు అసలు లేరు. అందుకే నేను ఎవరితో ప్రేమలో లేను. నా కుక్క అమ్మాయిలు ఇవ్వలేని అన్ కండీషనల్ ప్రేమని ఇస్తుంది అని అన్నాడు. దీంతో కార్తీక్ ఆర్యన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు కార్తీక్ వ్యాఖ్యలపై. కార్తీక్ తన కుక్క కటోరి గురించి చాలా సార్లు గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Hyderabad Black Hawks : విజయదేవరకొండతో కలిసి వాలీబాల్ మ్యాచ్ చూడండి.. విజయ్ టీంకి సపోర్ట్ చేయండి..

ఇక కార్తీక్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ కావడంతో అమ్మాయిల నుంచి విపరీతంగా ప్రపోజల్స్, పెళ్లి రిక్వెస్ట్ లు వస్తూనే ఉంటాయి. మరి కార్తీక్ ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత అమ్మాయిలు ఎలా రియాక్ట్ అయి కార్తిక్ ని ఇష్టపడతారో చూడాలి మరి.