Sunny Kaushal : ‘చిన్నప్పటి నుంచి నేను కూడా అలానే పెరిగా’.. ‘మెన్స్ డే’ రోజు సన్నీ కౌశల్ పోస్ట్..

బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం హిందీలో సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్ కూడా చేసాడు.

Sunny Kaushal : ‘చిన్నప్పటి నుంచి నేను కూడా అలానే పెరిగా’.. ‘మెన్స్ డే’ రోజు సన్నీ కౌశల్ పోస్ట్..

bollywood hero Sunny Kaushal shared a special post on the occasion of Mens Day

Updated On : November 20, 2024 / 2:14 PM IST

Sunny Kaushal : బాలీవుడ్ నటుడు సన్నీ కౌశల్ హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం హిందీలో సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్ కూడా చేసాడు. అయితే నిన్న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్బంగా తన సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేసాడు సన్నీ కౌశల్.

ఇక పోస్ట్ లో ఆయన.. ” కాలక్రమేణా పురుషత్వంపై అతని ఆలోచన ఎలా అభివృద్ధి చెందిందో తెలిపాడు. చిన్నతనంలో తను పురుషులు ఏడవకూడదని నమ్మాడట, కానీ అతను దాన్ని మార్చుకున్నారు.. దీని గురించి, సమాజం నుండి వచ్చిన కండిషనింగ్‌ను అర్థం చేసుకుంటూ వచ్చాడట. పురుషులు ఏడవకూడదని చెప్పినప్పుడు, లోతైన భావోద్వేగాలను ఆపడానికి, తరువాతి జీవితంలో ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు వారిని సిద్ధం చేయాలని ఇది కేవలం వారికేనని.. తను కూడా అలాగే పెరిగానని, కానీ తను దానిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను ”అని అతను వివరించాడు.

Also Read : Shah Rukh Khan : ‘బాత్రూంలో కూర్చొని ఏడ్చిన షారుఖ్’ .. అసలేం జరిగిందంటే..?

దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే సన్నీ కౌశల్, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ఇద్దరూ సోదరులు అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఇద్దరు అన్న దమ్ములు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంటున్నారు.