Bipasha Basu : ఆ సమయంలో నరకం అనుభవించాను అంటున్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు..

మహేష్ బాబు పక్కన టక్కరి దొంగ సినిమాలో నటించి తన అందాలతో అందర్నీ ఆకట్టుకున్న బిపాషా బసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Bipasha Basu : ఆ సమయంలో నరకం అనుభవించాను అంటున్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు..

Bollywood heroine Bipasha Basu shares her bad phase during her baby born

Bipasha Basu : బాలీవుడ్ భామ బిపాషా బసు తన రెండో సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసింది. 2002 లో తెరకెక్కిన కౌ బాయ్ మూవీ ‘టక్కరిదొంగ’ సినిమాలో కనిపించి తన అందాలతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ సినిమా హిట్టు కాకపోవడంతో బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ ని అందుకుంది. ఇక 2016లో ప్రముఖ బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ (Karan Singh) ని ప్రేమించి వివహం చేసుకుంది. గత ఏడాది ఒక పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనించింది.

Sai Rajesh : పవన్ అభిమానికి సహాయం చేసిన బేబీ దర్శకుడు.. 50,000 సెండ్ చేసి..

అయితే ఆ సమయంలో జరిగిన ఒక బాధాకరమైన విషయాన్ని బిపాషా తన తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది. తన కూతురు దేవి పుట్టిన 3 రోజులకు.. పాప హార్ట్ లో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలిసిందట. వెంట్రిక్యులర్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ (VSD) అనే సమస్య ఉందని, అది సరి చేయాలంటే సర్జరీ చేయాలని చెప్పారట. అయితే డాక్టర్స్ చెప్పింది ఏమి తనకి అర్ధంకాలేదట. పాప పుట్టిందని ఇంటిలో ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయం మాత్రం బిపాసా మరియు కరణ్ కి మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని ఆపరేషన్ అయ్యేవరకు ఎవరకి చెప్పకుండా.. గుండెల్లో భరించలేని భాదని పెట్టుకొని అందరూ ముందు నవ్వుతూ కనిపించారట.

Baby Movie : సూపర్ హిట్ ‘బేబీ’ మళ్ళీ రిలీజ్.. మరిన్ని సీన్స్, ఒక సాంగ్ యాడ్ చేసి.. 25 డేస్ సెలబ్రేషన్స్..

ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చింది. ఇక పాప మూడు నెలల వయసుకి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కరణ్ అంగీకరించలేకపోయాడట. పసిపాపకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అంటే ఎంతో బయపడ్డాడట. కానీ బిపాసా ఆ గండం నుంచి వీలైనంత త్వరగా గట్టెక్కాలని ఆపరేషన్ కి పాపని పంపించింది. సుమారు ఆరు గంటలపాటు సర్జరీ జరిగిందట. ఆపరేషన్‌ సక్సెస్‌ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. పాప పుట్టిన మొదటి 5 నెలలు ఎంతో కష్టంగా గడిసినట్లు కన్నీరు పెట్టుకుంది.