సుశాంత్ నా బిడ్డగా జన్మించబోతున్నాడు : రాఖీ సావంత్

Bollywood Heroine Rakhi Sawant Responded Suicide Sushant Singh 4536
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. సుశాంత్ సింగ్ మరణించి వారం రోజులు దాటుతున్నా ఇంకా ఎవరూ ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణించినప్పటి నుంచి బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ కిడ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, టాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో అన్‌ఫాలో స్టార్ కిడ్స్ అంటూ క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. అభిమానులే కాకుండా బాలీవుడ్ స్టార్‌లు కూడా సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువగా ఉందంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలను బయటపడుతున్నారు. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ సహా చాలా మంది బంధుప్రీతి చూపిస్తున్నారంటూ అభిమానులు ఏకిపారేస్తున్నారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్ ఈ విషయంలో తన అభిమానులు సుశాంత్ అభిమానులకు తోడుగా ఉండాలని పిలుపు నిచ్చాడు.
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రాఖీ సావంత్ సైతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించారు. దీనికి సంబంధించి రాఖీ సావంత్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సుశాంత్ తన కలలో కనిపించి బాలీవుడ్ తనని వెలివేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేగాక త్వరలోనే సుశాంత్ తనకు బిడ్డగా జన్మించబోతున్నాడని ఈ సందర్భంగా రాఖీ సావంత్ వెల్లడించారు. దీంతో పాటు పూర్తి కానీ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే చేయాలని కోరినట్లు ఈ వీడియోలో రాఖీ సావంత్ తెలిపింది.