Bollywood: బాలీవుడ్ ప్రేక్షకులు బాయ్‌కాట్ ట్రెండ్ ఫాలో అవుతుంటే.. అక్కడి హీరోలు మాత్రం మరోకొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు

బాలీవుడ్ లో ప్రేక్షకులంతా బాయ్‌కాట్ ట్రెండ్ ఫాలో అవుతుంటే, అక్కడి బడా హీరోలు మాత్రం ఒక సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మొన్న ఈ మధ్య వచ్చిన అక్షయ్, రణబీర్ నుంచి.. త్వరలో రాబోతున్న షారూఖ్, సల్మాన్ వరకూ అందరూ ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ బాలీవుడ్ హీరోలందరూ ఫాలో అవుతున్న ఆ థీమ్ ఏంటి..?

Bollywood: బాలీవుడ్ ప్రేక్షకులు బాయ్‌కాట్ ట్రెండ్ ఫాలో అవుతుంటే.. అక్కడి హీరోలు మాత్రం మరోకొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు

Bollywood Heros following Long Hair Trend

Updated On : September 6, 2022 / 7:01 PM IST

Bollywood: బాలీవుడ్ లో ప్రేక్షకులంతా బాయ్‌కాట్ ట్రెండ్ ఫాలో అవుతుంటే, అక్కడి బడా హీరోలు మాత్రం ఒక సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మొన్న ఈ మధ్య వచ్చిన అక్షయ్, రణబీర్ నుంచి.. త్వరలో రాబోతున్న షారూఖ్, సల్మాన్ వరకూ అందరూ ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ బాలీవుడ్ హీరోలందరూ ఫాలో అవుతున్న ఆ థీమ్ ఏంటి..?

Bollywood : ఇద్దరు స్టార్ హీరోలు.. అయినా తప్పని ఫ్లాపులు.. బాలీవుడ్ కి భరోసా ఎప్పుడో??

టాలీవుడ్ హీరో వెంకటేష్, పూజా హెగ్డే, సల్మాన్ లీడ్ రోల్స్ లో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ పతాకంపై ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవ్వబోతున్న భారీ బడ్జెట్ చిత్రం “కిసీకా భాయ్ కిసీకీ జాన్”కి సంబంధించి చిత్ర యూనిట్ ఒక వీడియోని విడుదల చేసింది. దాదాపు నిమిషం పాటు ఉన్న ఆ వీడియోలో సల్మాన్ కొత్తగా లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరోలందరూ లాంగ్ హెయిర్ తో సినిమాలు చేస్తూ.. సేమ్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఏదో ఒకరిద్దరు అంటే కో-ఇన్సిడెన్స్ అనుకోవచ్చు..కానీ బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ పఠాన్ లో కూడా లాంగ్ హెయిర్ తోనే కొత్తగా కనిపిస్తున్నాడు. అలానే లాల్ సింగ్ చద్దాలో అమీర్, రామసేతులో అక్షయ్, షంషేరాలో రణబీర్ ఇలా బాలీవుడ్ హీరోలందరూ కట్టకట్టుకుని అందరూ లాంగ్ హెయిర్ తోనే సినిమాలు చేస్తున్నారు. వీళ్లని చూసి ఇక ఫాన్స్ కూడా ఇదే లాంగ్ హెయిర్ ట్రెండ్ ఫాలో అవుతారేమో అంటున్నారు జనాలు .