Rowdy Rathore : విక్రమార్కుడు సీక్వెల్ త్వరలో.. కానీ తెలుగులో కాదు..
ప్రభుదేవా ఈ సినిమాను డైరెక్ట్ చేయగా రౌడీ రాథోర్ అక్కడ కూడా భారీ విజయం సాధించింది. గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తారని వార్తలు రాగా, తాజాగా ఈ సినిమా సీక్వెల్ వర్క్ జరుగుతుందని సమాచారం.

Bollywood ready to do Rowdy Rathore sequel
Rowdy Rathore : మన తెలుగులో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన విక్రమార్కుడు(Vikramarkudu) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్స్ లో రవితేజ అదరగొట్టేశాడు. ఈ సినిమాకు సీక్వెల్ కావాలని రవితేజ అభిమానులు, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇదే సినిమాని బాలీవుడ్(Bo0llywood) లో అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా రౌడీ రాథోర్(Rowdy Rathore) అనే పేరుతో రీమేక్ చేశారు.
ప్రభుదేవా ఈ సినిమాను డైరెక్ట్ చేయగా రౌడీ రాథోర్ అక్కడ కూడా భారీ విజయం సాధించింది. గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తారని వార్తలు రాగా, తాజాగా ఈ సినిమా సీక్వెల్ వర్క్ జరుగుతుందని సమాచారం. బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల సంజయ్ ఆఫీస్ లో డైరెక్టర్ అనీస్ బజ్మీ రౌడీ రాథోర్ సీక్వెల్ గురించి చర్చలు జరిపి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారని బాలీవుడ్ సమాచారం. అయితే ఈ సారి రౌడీ రాథోర్ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ కాకుండా వేరే హీరోని తీసుకోవాలని అనుకుంటున్నారు.
Pawan kalyan : OG సెట్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. OG వర్కింగ్ స్టిల్స్ గ్యాలరీ..
ఇప్పటికే కియారా అద్వానీ హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందని అందుకే సిద్దార్థ్ మల్హోత్రాని హీరోగా తీసుకుందామని అనీస్ బజ్మీ భావిస్తున్నాడు. కానీ దీనిపై నిర్మాత భన్సాలీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న రౌడీ రాథోర్ సీక్వెల్ సినిమా ఎప్పటికి మొదలవుతుందో, ఈ సారి ఏ హీరోతో ఏ రేంజ్ లో తీస్తారో చూడాలి. రౌడీ రాథోర్ సీక్వెల్ పై బాలీవుడ్ తో పాటు, ఆ సీక్వెల్ ని ఎలా తీస్తారు అని టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.