CID Actor : హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్ బెడ్ పై సిఐడీ యాక్టర్..

సూపర్ హిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సీరియల్ 'సిఐడీ' నటుడు దినేష్ ఫండ్నిస్ హార్ట్ ఎటాక్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

CID Actor : హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్ బెడ్ పై సిఐడీ యాక్టర్..

Bollywood serial CID Actor Dinesh Phadnis hospitalised due to heart attack

Updated On : December 3, 2023 / 3:44 PM IST

CID Actor : ఇప్పుడంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ద్వారా వెబ్ సిరీస్ కల్చర్ అలవాటు అయ్యింది గాని ఒకప్పుడు యూత్ కూడా టెలివిజన్ లో వచ్చే పలు సీరియల్స్ ని కచ్చితంగా ఫాలో అయ్యవారు. ఈక్రమంలోనే అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయిన సీరియల్ ‘సిఐడీ’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. జనరల్ ఆడియన్స్ కి క్లూస్ అండ్ ఫోరెన్సిక్ విభాగాన్ని పరిచయం చేసింది ఈ సీరియలే.

బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సీరియల్ సౌత్ లోని పలు లాంగ్వేజ్స్ లో కూడా డబ్ వెర్షన్ తో స్ట్రీమ్ అయ్యింది. ఇక ఈ సీరియల్ లో ‘ఫ్రెడెరిక్స్’ అనే పాత్రని పోషించిన దినేష్ ఫడ్నిస్.. అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. 57 ఏళ్ళ వయసు ఉన్న దినేష్ ఫండ్నిస్ కి డిసెంబర్ 1న హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను వెంటనే ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వెంటిలేటర్ పై చికిత్సని అందిస్తున్నారు.

Also read : Nithiin – Sreeleela : శ్రీలీల పై నవ్వుతూనే సెటైర్లు వేసిన నితిన్.. ఆమెతో వర్క్ చేయడం..

ఈ విషయాన్ని సిఐడీ సీరియల్ నటించిన మరో నటుడు దయానంద్ శెట్టి తెలియజేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సిఐడీ సీరియల్ అభిమానులు.. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. దినేష్ ఫండ్నిస్ దాదాపు 20 ఏళ్లగా సిఐడీ సీరియల్ లో భాగంగా నటిస్తూ వస్తున్నారు. ఈ సీరియల్ తో పాటు పలు ఇతర సీరియల్స్, కొన్ని సినిమాల్లో కూడా దినేష్ ఫండ్నిస్ నటించారు.