Nithiin – Sreeleela : శ్రీలీల పై నవ్వుతూనే సెటైర్లు వేసిన నితిన్.. ఆమెతో వర్క్ చేయడం..
శ్రీలీలతో వర్క్ చేయడం గురించి నవ్వుతూనే సెటైర్లు వేసిన నితిన్.

Nithiin viral comments on Sreeleela in Extra Ordinary Man movie promotions Nithiin viral comments on Sreeleela in Extra Ordinary Man movie promotions
Nithiin – Sreeleela : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్స్ నితిన్ అండ్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ అంటూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా మూడో సాంగ్ ని ఈవెంట్ పెట్టి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్‌ని శ్రీలీలతో వర్క్ ఎక్స్‌పీరెన్స్ లో మీకు ఛాలెంజింగ్ అనిపించిన విషయం ఏంటని ప్రశ్నించారు. దీనికి నితిన్ బదులిస్తూ.. శ్రీలీల పై నవ్వుతూనే సెటైర్లు వేశారు.
నితిన్ కామెంట్స్.. “ఆమె సినిమాకు డేట్స్ ఇవ్వడమే పెద్ద ఛాలెంజ్. ఒకవేళ డేట్స్ ఇస్తే ఆమె ఇచ్చిన డేట్స్ కి తగ్గట్టు మా డేట్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం ఒక ఛాలెంజ్. ఆమె ఇచ్చిన డేట్స్ లో హాఫ్ డే ఉంటుంది, కొన్ని గంటల సమయం కూడా ఉంటుంది. ఆ గంటలలోనే ఆమె పై ఏ సీన్ చిత్రీకరించాలనేది మరో ఛాలెంజ్. నేడు ప్రమోషన్స్ కి రావాలి. కానీ ఆమె రేపు వస్తాను అని చెప్పింది. మరి రేపు అయినా వస్తుందా లేదా అనేది కూడా ఛాలెంజె” అంటూ నవ్వుతూనే శ్రీలీలతో ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టాడు.
Also read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ లేటెస్ట్ అప్‌డేట్.. వర్చువల్ స్టూడియోలో షూటింగ్
కాగా నితిన్ తనకి ‘భీష్మ’ వంటి సూపర్ హిట్టుని అందించిన వెంకీ కుడుములుతో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా మొదట రష్మికని అనుకున్నా.. ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి శ్రీలీల వచ్చి చేరారు. ఇక నితిన్ ఈ విషయం గురించి మాట్లాడుతూనే.. “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో వంశీ, శ్రీలీలతో ప్రాబ్లెమ్స్ పేస్ చేశాడు. రేపు నా నెక్స్ట్ సినిమాలో వెంకీ ఆ సమస్యలను పేస్ చేయనున్నాడు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఇదే ఇంటర్వ్యూలో శ్రీలీల చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అని, ఆమె డాన్స్ చాలా వేగంగా వేస్తుందని, ఆమె స్పీడ్ ని మ్యాచ్ చేయడానికి తాను చాలా కష్టపడినట్లు నితిన్ చెప్పుకొచ్చారు. డిసెంబర్ 8న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ‘బీష్మ’ తరువాత ఒక్క హిట్టు లేని నితిన్ ఈసారి హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.