Akshay Kumar : శంకర్ దాదా MBBS లింగం మామకు లీగల్ నోటీసులు పంపిన అక్షయ్ కుమార్.. అన్ని కోట్లు కట్టాలంటూ..

హెరా ఫేరీ మరో సీక్వెల్ లో కూడా అక్షయ్ - పరేష్ నవ్విస్తారని అంతా ఫిక్స్ అయ్యారు.

Akshay Kumar Sends Legal Notice to Paresh Rawal

Akshay Kumar : అక్షయ్ కుమార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కామెడీ సినిమా హెరా ఫేరీ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేసారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రవెల్ మెయిన్ లీడ్స్ లో కామెడీ థ్రిల్లింగ్ డ్రామాగా ఈ సినిమాలు తెరకెక్కాయి. హెరా ఫేరీ 2000 సంవత్సరంలో రాగా దానికి సీక్వెల్ ఫిర్ హెరా ఫేరీ 2006 లో వచ్చింది. 19 ఏళ్ళ తర్వాత మళ్ళీ దీనికి సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించారు.

ఆ రెండు సినిమాలలో అక్షయ్ కుమార్ – పరేష్ రావల్ కాంబో అందర్నీ ఫుల్ గా నవ్వించింది. దీంతో హెరా ఫేరీ మరో సీక్వెల్ లో కూడా అక్షయ్ – పరేష్ నవ్విస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. అయితే ఇటీవల పరేష్ రావల్ నేను హెరా ఫేరీ 3 లో నటించట్లేదని ప్రకటించాడు. ఈ విషయం మూవీ యూనిట్ కి కూడా చెప్పకుండా ప్రకటించడంతో అక్షయ్, సునీల్ శెట్టి, మిగిలిన మూవీ యూనిట్ అంతా షాక్ అయ్యారు.

Also Read : Kiara Advani : ఎన్టీఆర్ సినిమా కోసం మొదటిసారి బికినీ వేసిన ‘కియారా అద్వానీ’.. ఫస్ట్ టైం అంటూ కియారా స్పెషల్ పోస్ట్..

అయితే అందరూ కథ చర్చల్లో విబేధాలు వచ్చి సినిమా నుంచి పరేష్ రావల్ తప్పుకున్నాడేమో అని అనుకోగా దానిపై పరేష్ స్పందిస్తూ.. నాకు, హెరా ఫేరీ మూవీ టీమ్ కి ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ లేదు అని అధికారికంగానే ప్రకటించాడు. దీంతో ఎందుకు పరేష్ రావల్ అంత సూపర్ హిట్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకున్నాడా అర్ధం కాలేదు.

తాజాగా బాలీవుడ్ సమాచారం ప్రకారం అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ పరేష్ రావల్ కి హెరా ఫేరీ 3 నుంచి తప్పుకున్నందుకు 25 కోట్ల నష్ట పరిహారం కట్టాలని లీగల్ నోటీసులు పంపినట్టు తెలుస్తుంది. ఎలాంటి సమాచారం లేకుండా సినిమా నుంచి అర్దాంతరంగా తప్పుకున్నందుకే అక్షయ్ కుమార్ పరేష్ కి లీగల్ నోటీసులు పంపించాడని బాలీవుడ్ మీడియా అంటుంది. మరి దీనిపై పరేష్ రావల్ స్పందిస్తాడా చూడాలి. పరేష్ రావల్ తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించారు. చిరంజీవి శంకర్ దాదా MBBS సినిమాలో లింగం మామయ్యాగా అందర్నీ మెప్పించి ఇక్కడ కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు.

Also Read : Ambika Krishna : సినిమా థియేటర్స్ బంద్ కి పెద్ద హీరోలే కారణం.. ఒప్పుకోకపోతే థియేటర్స్ బంద్..