Kishore Kumar Biopic : బాలీవుడ్ లో మరో బయోపిక్.. లెజండరీ యాక్టర్ / సింగర్ బయోపిక్‌లో రణబీర్..
రణబీర్ కపూర్ గతంలో ఆల్రెడీ సంజయ్ దత్ బయోపిక్ లో నటించి మెప్పించాడు. ఇటీవల రణబీర్ గంగూలీ బయోపిక్ లో కూడా నటిస్తాడని వార్తలు వచ్చినా అది నిజం కాదంటూ కొట్టి పారేశాడు రణబీర్. ప్రస్తుతం రణబీర్ తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా..............

Bollywood star hero Ranbir Kapoor working for legendary singer and actor Kishore Kumar Biopic
Kishore Kumar Biopic : బాలీవుడ్ లో ఎక్కువగా బయోపిక్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే. ఏదో కొన్ని బయోపిక్స్ హిట్ అయినా చాలా బయోపిక్స్ ఫ్లాప్స్ గానే మిగిలిపోయాయి. అయినా బాలీవుడ్ వాళ్ళు బయోపిక్స్ అంటూ ఇంకా సినిమాలు చేస్తున్నారు. సీనియర్ యాక్టర్స్, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, మరింతమంది పలువురు ప్రముఖుల బయోపిక్స్ తీస్తూనే ఉన్నారు. తాజాగా రణబీర్ మరో బయోపిక్ లో నటిస్తున్నాను అని ప్రకటించాడు.
రణబీర్ కపూర్ గతంలో ఆల్రెడీ సంజయ్ దత్ బయోపిక్ లో నటించి మెప్పించాడు. ఇటీవల రణబీర్ గంగూలీ బయోపిక్ లో కూడా నటిస్తాడని వార్తలు వచ్చినా అది నిజం కాదంటూ కొట్టి పారేశాడు రణబీర్. ప్రస్తుతం రణబీర్ తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కోల్‌కత్తాకి వెళ్ళాడు. అక్కడ గంగూలీతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. అనంతరం ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. మీడియా వాళ్ళు గంగూలీ బయోపిక్ గురించి అడగగా దానికి కూడా సమాధానం చెప్పాడు.
#SidKiara : సిద్దార్థ్ ని పెళ్లి పీటల మీద చూడగానే.. ప్రేమ పెళ్లిపై మొదటిసారి మాట్లాడిన కియారా..
రణబీర్ మాట్లాడుతూ.. నేను గంగూలీ బయోపిక్ లో నటిస్తానని వచ్చిన వార్తలు అబద్దం. దానికోసం నన్నెవరూ స్పందించలేదు. చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను. త్వరలో నేను లెజండరీ యాక్టర్, సింగర్ కిషోర్ కుమార్ గారి బయోపిక్ లో నటించబోతున్నాను. కిషోర్ కుమార్ బయోపిక్ కి సంబంధించిన పనులు గత పదేళ్లుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు మీద మేము పదేళ్లుగా పని చేస్తున్నాము. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది అని తెలిపాడు. దీంతో బాలీవుడ్ లో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి, సింగర్ గా ఎన్నో లవ్ సాంగ్స్ తో ప్రేక్షకులని మెప్పించిన ఒకప్పటి స్టార్ నటుడు, గాయకుడు కిషోర్ కుమార్ బయోపిక్ రానున్నట్టు తెలుస్తోంది.