శ్రీదేవి సినిమా ఆపండి…కోర్టు మెట్లెక్కుతున్న బోనీ కపూర్!

శ్రీదేవి సినిమా ఆపండి…కోర్టు మెట్లెక్కుతున్న బోనీ కపూర్!

New Project (4)

Updated On : July 31, 2021 / 5:05 PM IST

మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్కసారి కన్నుగీటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శ్రీదేవి బంగ్లా’ అంటూ మరో సినిమాతో మన ముందుకు రానుంది.అయితే ఈ సినిమా ట్రైలర్‌లో హీరోయిన్ బాత్ టబ్‌ లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో శ్రీదేవి నిజ జీవితానికి ఇది దగ్గరగా ఉందని శ్రీదేవి భర్త బోనీ కపూర్ సినిమా యూనిట్‌కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించాడు.

బోనీ కపూర్ ఇచ్చిన నోటీసులపై చిత్రయూనిట్ స్పందించక పోవడంతో సినిమా విడుదలను ఆపేందుకు బోనీ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాలో ఏ సీన్ ఎలా చూపించుకోవాలి అనేది నాకు అవసరం లేదు. అది వారి ఇష్టం, కానీ టైటిల్‌ లో మాత్రం శ్రీదేవి పేరు ఉండకూడదు అని బోనీ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాపై ఇలాంటి గొడవలు నడుస్తున్నాయని తెలిసి కూడా సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ఇందులో గెస్ట్ రోల్ లో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాకు శ్రీదేవికి ఎలాంటి సంబంధం ఉండదని తెలుసే నటించేందుకు ఒప్పుకున్నాని అర్బాన్ ఖాన్ తన వెర్షన్ వినిపిస్తున్నారు.