Mobile Ownership : బిగ్ అలర్ట్.. బ్యాంకు, యూపీఐ యాప్స్‌లో మొబైల్ నెంబర్ ఓనర్‌షిప్ వెరిఫికేషన్ మస్ట్.. ఇక మీ పేరుతో ఉంటేనే..!
Mobile Number Ownership : అతి త్వరలో బ్యాంకు అకౌంట్లు, యూపీఐ యాప్స్‌లో ఇక మీ పేరుతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు..

Mobile Number Ownership
Mobile Number Ownership : ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఐడెంటిటీ థెఫ్ట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) కొత్త మొబైల్ నంబర్ వ్యాలిడేషన్ (MNV) ప్లాట్‌ఫామ్‌ను ప్రతిపాదించింది.
నివేదిక ప్రకారం.. ఈ ప్లాట్‌ఫామ్ బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు టెలికాం ఆపరేటర్లతో నేరుగా మొబైల్ నంబర్ ఓనర్ షిప్ వెరిఫికేషన్ చేసేందుకు అనుమతిస్తుంది. అంటే.. సైబర్ మోసం తర్వాత డబ్బును విత్ డ్రా చేసేందుకు ఉపయోగించే మోసపూరిత లేదా స్కామ్ అకౌంట్లలో మొబైల్ నంబర్ల వినియోగాన్ని అరికట్టడమే ఈ చొరవ లక్ష్యంగా చెప్పొచ్చు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సపోర్టు :
ఈ చొరవకు హోం వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నుంచి కూడా మద్దతు లభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌తో పాటు సిమ్ జారీ చేసే సమయంలో ఐడెంటిటీ థెఫ్ట్ మోసాన్ని నిరోధించడానికి టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ కోసం ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ సొల్యుషన్స్ వంటి టెక్నాలజీని కూడా కమిటీ వినియోగించాలని భావిస్తోంది.
Read Also : RBI Lock Phones : EMIల్లో ఫోన్లు కొనేవాళ్లు అందరికీ బిగ్ అలర్ట్.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..!
టెలికాం సైబర్ భద్రతా సవరణలు :
ప్రస్తుతం, బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ నిజంగా ఖాతాదారుడిదేనని నిర్ధారించే వ్యవస్థ లేదు. ఈ కొత్త సిస్టమ్ బ్యాంకులు, ఫిన్‌టెక్ ఆపరేటర్లు టెలిఫోన్ నంబర్‌ల యాజమాన్యాన్ని టెలికాం ప్రొవైడర్లతో నేరుగా వెరిఫికేషన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇందులో భాగంగా టెలికాం సైబర్ భద్రతా నియమాలకు సవరణలను కూడా DoT ప్రతిపాదించింది.
ప్రైవసీపై ఆందోళనలు :
అయితే, ప్రైవసీపరంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధలను ప్రైవసీ యాక్టివిస్టులు వ్యతిరేకిస్తున్నారు. వినియోగదారుల ప్రైవసీకి భంగం కలిగిస్తాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, సైబర్ మోసాలను నివారించేందుకు ప్రైవసీ ప్రొటెక్షన్ సిస్టమ్ ను తక్షణమే అమలు చేయాలని పార్లమెంటరీ కమిటీ కోరింది.
వినియోగదారులపై ప్రభావం :
ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. తల్లిదండ్రులు, బంధువులు లేదా మరొక వ్యక్తి పేరుతో ఉన్న తమ బ్యాంక్ అకౌంట్లలో సిమ్ కార్డును రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులపై ప్రభావం పడుతుంది. అలాంటి వినియోగదారులు ప్రైవసీపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ, ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత మరింత స్పష్టత రానుంది.