Balakrishna vs Pawan Kalyan : బాల‌య్య వ‌ర్సెస్ ప‌వ‌న్‌.. థియేట‌ర్లలో ర‌చ్చ ర‌చ్చే..

2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్‌కు తెర లేవనుంది.

Both OG and Akhanda 2 movies release on Sep 25th 2025

2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్‌కు తెర లేవనుంది. ఈసారి ద‌స‌రా పండుగ‌కు ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు పోటీప‌డుతున్నాయి. అందులో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ఓజీ చిత్రం కాగా.. మ‌రొక‌టి నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ 2 చిత్రం. ఈ రెండు సినిమాలు కూడా 2025 సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ఓజీ చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ క‌థ‌నాయిక‌. శ్రియా రెడ్డి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పై దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ప‌వ‌న్ పాత్ర‌ను సంబంధించిన షూటింగ్ ఇటీవ‌లే పూర్తైంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది.

Harihara Veeramallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ న్యూ రిలీజ్ డేట్ పై చిత్ర బృందం క్లారిటీ..

మ‌రోవైపు అఖండ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 చిత్రం తెర‌కెక్కుతోంది. బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌ర‌పుకుంటోన్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా నందమూరి తేజస్విని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

SSMB29 : మ‌హేశ్‌బాబు, రాజ‌మౌళి మూవీకి నో చెప్పిన స్టార్ హీరో!

ఇక ఈ రెండు సినిమాలు కూడా ద‌స‌రా హ‌లీడేస్‌ను క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నాయి. కాగా.. ఒకే రోజు రెండు సినిమాలు విడుద‌లైతే సినీ ప్రియుల‌కు పండ‌గే. అదే స‌మ‌యంలో ఆయా సినిమాల క‌లెక్ష‌న్ల పై గ‌ట్టిగానే ప్ర‌భావం చూపించొచ్చు. విడుద‌ల తేదీకి మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఉంది. ఈ లోగా రెండు సినిమాల్లో ఏదైన సినిమా రిలీజ్ డేట్‌ను మార్చుకుంటా? లేదా రెండు చిత్రాలు కూడా చెప్పిన‌ట్లుగా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయో చూడాల్సిందే.