Harihara Veeramallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ న్యూ రిలీజ్ డేట్ పై చిత్ర బృందం క్లారిటీ..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.

Harihara Veeramallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ న్యూ రిలీజ్ డేట్ పై చిత్ర బృందం క్లారిటీ..

Movie unit clarity on Hari hara veera mallu new release date

Updated On : June 9, 2025 / 7:16 PM IST

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎఎమ్ ర‌త్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ భారీ పీరియాడిక్ యాక్ష‌న్ చిత్రం జూన్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. గ్రాఫిక్స్ ప‌నులు ఆల‌స్యం అవుతుండ‌డంతో ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ఇటీవ‌లే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. ఈ చిత్ర కొత్త విడుద‌ల తేదీ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. జూన్ 26న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఆ వార్త సారాంశం.

SSMB29 : మ‌హేశ్‌బాబు, రాజ‌మౌళి మూవీకి నో చెప్పిన స్టార్ హీరో!

కాగా.. దీని పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త‌లో ఎలాంటి నిజం లేదంది. అలాంటి వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని సూచించింది. చిత్ర విడుద‌ల తేదీని త‌మ అధికారిక ఛాన‌ళ్ల ద్వారా త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పేర్కొంది.

Akhanda 2 : బాల‌య్య ‘అఖండ 2’ టీజ‌ర్‌.. గూస్ బంప్స్ అంతే..

‘ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న అన్ని విడుదల తేదీలను దయచేసి విస్మరించండి. కొత్త అధికారిక విడుదల తేదీని మా అధికారిక ఛానెల్స్‌ ద్వారా కొన్ని రోజుల్లో ప్రకటిస్తాము. అప్పటి వరకు మీ ప్రేమ, మద్దతును కొనసాగించమని మేము అభ్యర్థిస్తున్నాము.’అని ట్వీట్ చేసింది.