SSMB29 : మ‌హేశ్‌బాబు, రాజ‌మౌళి మూవీకి నో చెప్పిన స్టార్ హీరో!

సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో SMB29 ఒకటి.

SSMB29 : మ‌హేశ్‌బాబు, రాజ‌మౌళి మూవీకి నో చెప్పిన స్టార్ హీరో!

Star hero Vikram rejects a role in SSMB29

Updated On : June 9, 2025 / 6:33 PM IST

సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో SMB29 ఒకటి. ద‌ర్శ‌కుడు రాజమౌళి గ్లోబల్‌ ప్రాజెక్ట్. అందులోనూ హీరో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. ఇలాంటి మూవీలో కీ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఎంతటి యాక్టర్స్‌ అయినా ఓకే అనేస్తారు. కానీ ఓ బాలీవుడ్‌ యాక్టర్‌, మ‌రో కోలీవుడ్‌ టాప్‌ హీరో ఆ రోల్‌కి నో చెప్పారనే న్యూస్‌ వైరలవుతోంది.

అఫీషియల్‌ అప్‌డేట్ లేకపోయినా SSMB29 పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఈ సినిమా కాంబినేషన్‌, కాస్టింగ్‌కి సంబంధించిన న్యూస్‌ ఏదో ఒకటి వైరల్‌ అవుతూనే ఉంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ లాంటి క్రేజీ స్టార్‌ కాస్ట్‌ నటిస్తోన్న ఈ సినిమాలో చాలా కీ రోల్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోల్స్‌ కోసం భారీ ప్లాన్‌ చేశారు రాజమౌళి. అయితే ఈ ఇంపార్టెంట్ రోల్‌ని బాలీవుడ్‌ యాక్టర్‌ నానాపటేకర్, అలాగే తమిళ స్టార్‌ హీరో విక్రమ్ రిజెక్ట్‌ చేశారనే న్యూస్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది మహేశ్‌-రాజమౌళి సినిమా. దీంతో నార్త్‌ టూ సౌత్‌ క్రేజ్‌ ఉన్న మరో తమిళ హీరోని అప్రోచ్‌ అయ్యారట డైరెక్టర్‌ రాజమౌళి.

Akhanda 2 : బాల‌య్య ‘అఖండ 2’ టీజ‌ర్‌.. గూస్ బంప్స్ అంతే..

ఆర్ఆర్ఆర్‌ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి.. ప్రజెంట్‌ మహేశ్‌ బాబు సినిమా షూటింగ్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఒకవైపు షెడ్యూల్స్‌ ప్లాన్ చేస్తూనే సినిమా కాస్టింగ్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు రాజమౌళి. అమెజాన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ వెయ్యి కోట్ల సినిమాలో మరో కీ రోల్‌ కోసం యాక్టర్‌ని ఫైనల్‌ చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం బాలీవుడ్‌ యాక్టర్‌ నానా పటేకర్‌ని అప్రోచ్‌ అయితే.. ఆయన డేట్స్‌ ఖాళీ లేవని చెప్పి సున్నితంగా మహేశ్-రాజమౌళి సినిమాని రిజెక్ట్‌ చేశారు. అంతేకాదు రెమ్యునరేషన్‌ కింద 20 కోట్లు ఆఫర్‌ చేసినా ఆఫర్‌ తిరస్కరించిచారనే న్యూస్‌ వైరల్‌ అయ్యింది. దీంతో తమిళ హీరో విక్రమ్‌ని అప్రోచ్‌ అయ్యింది రాజమౌళి అండ్‌ టీమ్.

SSMB29 ప్రాజెక్ట్‌లో కీ రోల్‌ని హీరో విక్రమ్‌ కూడా రిజెక్ట్‌ చేశారనే న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత వీర ధీర శూర సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు విక్రమ్. అయితే మహేశ్‌-రాజమౌళి సినిమాకి ఆఫర్‌ చేసిన కీ రోల్‌కి నెగిటివ్‌ షేడ్స్‌ ఉండటంతో.. ఆ ఆఫర్‌ని విక్రమ్‌ రిజెక్ట్‌ చేయడానికి మెయిన్‌ రీజన్స్‌ అంటున్నారు జనాలు. దీంతో ఆలోచనలో పడిన రాజమౌళి అండ్‌ టీమ్.. నార్త్‌ టూ సౌత్‌ ఆడియెన్స్‌లో క్రేజ్‌ ఉన్న యాక్టర్‌ని వెతికే పనిలో పడింది.

Mahesh Babu : అఖిల్ రిసెప్షన్‌లో మహేశ్ బాబు ధ‌రించిన టీ ష‌ర్ట్ ధ‌ర ఎంతో తెలుసా? మైండ్ బ్లాకే..

మహేశ్‌-రాజమౌళి వెయ్యి కోట్ల సినిమాలో తమిళ నటుడు మాధవన్‌ కనిపించే చాన్సెస్‌ ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్‌ విన్న మాధవన్.. సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారనే క్రేజీ న్యూస్‌తో SSMB29 ప్రాజెక్ట్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.