Boyapati Sreenu announce Skanda 2 Ram Pothineni played dual role
Skanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటించిన సినిమా ‘స్కంద’. టీజర్ అండ్ ట్రైలర్ తో మంచి బజ్‌నే క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక థియేటర్స్ లో ఆడియన్స్ కి రామ్ అండ్ బోయపాటి మాస్ జాతర చూపించారు. రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా ఈ మూవీలో బోయపాటి చూపించాడు. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంటున్న ఈ మూవీకి.. బోయపాటి సీక్వెల్ ప్రకటించేశాడు.
Jawan : ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం.. జవాన్ ఆఫర్ అందుకోసమేనా..?
ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్ లో కనబడి సర్‌ప్రైజ్ చేశాడు. అలాగే ఈ సినిమా ఎండ్ టైటిల్ తోనే స్కంద 2 ని కూడా అనౌన్స్ చేసేశాడు. అఖండకి వచ్చిన క్రేజ్ తో బోయపాటి అఖండ 2 ప్రకటించాడు. ఆ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు స్కంద 2 ని క్రేజ్ రావడానికి కంటే ముందే ప్రకటించేశాడు. మరి ఈ సీక్వెల్ పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారా..? లేదా..? చూడాలి. కాగా రామ్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ లుగా నిలిచాయి. ఇప్పుడు స్కంద రామ్ ని హిట్ ట్రాక్ ఎక్కించినట్లే కనిపిస్తుంది.
Allu Arjun : క్రిష్ జాగర్లమూడితో అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమా..?
ఈ సినిమాలో రామ్ కి హీరోయిన్స్ గా శ్రీలీల (Sreeleela), సయీ మంజ్రేకర్ నటించారు. శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. మూవీలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక సాంగ్స్ లో రామ్ అండ్ శ్రీలీల కలిసి వేసిన స్టెప్స్ థియేటర్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయి. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.