Boyapati Srinu Ram Pothineni Skanda movie Collections details
Skanda Collections : బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన సినిమా ‘స్కంద’. శ్రీలీల, సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో రామ్ తో బోయపాటి ఓ రేంజ్ మాస్ చూపించాడు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ జోరు చూపిస్తుంది. ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ అందుకొని రామ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.
Naveen Chandra : ఆ యాంకర్ వల్లే నవీన్ చంద్ర నటుడయ్యాడట.. ఎవరంటే?
మొదటి రోజు రూ.18.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ మూవీ రెండో రోజు రూ.9.4 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.27.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజున ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.6.8 కలెక్షన్స్ ని రాబట్టింది. మొత్తం మూడు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.34.4 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. నేడు ఆదివారం వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికి ఎంతటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
Boyapati Srinu Ram Pothineni Skanda movie Collections details
Alia Bhatt : మా నాన్న మద్యానికి బానిసయ్యాడు.. ఆర్ధిక ఇబ్బందులు చూశాము..
ప్రస్తుతం స్కందతో రిలీజ్ అయిన సినిమాల నుంచి పెద్దగా పోటీ ఏమి లేదు. మరి ఈ అవకాశాన్ని స్కంద ఉపయోగించుకొని నిర్మాతను ఒడ్డు ఎక్కిస్తుందా..? లేదా..? చూడాలి. కాగా ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరు 95 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను డిస్నిప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. ఈ సినిమా అక్టోబర్ నెలాఖరులో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది.