Naveen Chandra : ఆ యాంకర్ వల్లే నవీన్ చంద్ర నటుడయ్యాడట.. ఎవరంటే?

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఏ పాత్రలో అయినా అలవోకగా నటించే నవీన్ చంద్ర లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు' అక్టోబర్ 6 న థియేటర్లలోకి వస్తోంది. సినిమా ప్రమోషన్లలో ఉన్న నవీన్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Naveen Chandra : ఆ యాంకర్ వల్లే నవీన్ చంద్ర నటుడయ్యాడట.. ఎవరంటే?

Naveen Chandra

Naveen Chandra : ‘అందాల రాక్షసి’ సినిమాతో సినిమాల్లో వచ్చి తక్కువ టైంలోనే నటుడిగా నిలదొక్కుకున్న హీరో నవీన్ చంద్ర. క్యారెక్టర్ ఏదైనా నటుడిగా సత్తా చాటుకున్నాడు. రీసెంట్‌గా స్వాతితో జంటగా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ అక్టోబర్ 6 న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో నవీన్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Month of Madhu : ‘మంత్ అఫ్ మధు’ ప్రెస్ మీట్ ఈవెంట్ ఫోటోలు.. తేజ్ అండ్ స్వాతి ఫ్రెండ్‌షిప్..

నవీన్ చంద్ర సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం యాంకర్ ఉదయభాను అట. ఆమె మోటివేషన్ వల్లనే తాను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానని నవీన్ చంద్ర చెప్పారు. 2001 లో ఒక డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ వచ్చిన నవీన్ చంద్ర మొదటిసారి అన్నపూర్ణ స్టూడియోను చూసారట. ఉదయభాను కారణంగానే తనకు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసిందని తను ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికి మర్చిపోను అని నవీన్ చంద్ర చెప్పారు. ప్రస్తుతం ఉదయభాను టచ్‌లో లేరని సోషల్ మీడియాలో తనని ఫాలో అవుతుంటానని చెప్పారు.

Naveen Chandra : నవీన్ చంద్ర భార్య గురించి తెలుసా? తను కూడా సినిమా ఇండస్ట్రీనే.. త్వరలో డైరెక్టర్ గా?

నవీన్ చంద్ర త్రిపుర, లచ్చిందేవికీ ఓలెక్కుంది,అరవింద సమేత వీర రాఘవ, భానుమతి & రామకృష్ణ వంటి సినిమాల్లో నటించారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నవీన్ చంద్ర నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారట. ఒకానొక టైమ్‌లో అవకాశాలు రాక పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిన నవీన్ రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతం నవీన్, స్వాతి జంటగా నటిస్తున్న ‘మంత్ ఆప్ మధు’ అక్టోబర్ 6 న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో వీళ్లిద్దరి కెమెస్ట్రీ ఆకట్టుకునేలా ఉండొచ్చని ఇప్పటికే విడుదలైన టీజర్, మొదటి పాటను చూస్తే అర్ధమవుతుంది. ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాను శ్రీకాంత్ నగోటి డైరెక్ట్ చేసారు.