నమ్మరేంట్రా బాబూ.. బిల్డప్ బాబాయ్ బ్రహ్మానందం

నమ్మరేంట్రా బాబూ.. బిల్డప్ బాబాయ్ బ్రహ్మానందం

Brahmanandam

Updated On : April 25, 2021 / 11:51 AM IST

Brahmanandam: నమ్మరేంట్రా బాబూ అంటూ జబర్దస్త్‌లో గెటప్ శీనుది ఓ క్యారెక్టర్ బాగా ఫేమస్.. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఓ సినిమాలో చేయబోతున్నారు. గెట‌ప్ శ్రీ‌ను వేసిన బిల్డ‌ప్ బాబాయ్ ఎపిసోడ్‌లో `న‌మ్మ‌రేంట్రా బాబూ` అంటూ సాగే మేనరిజం ఆకట్టుకుంటుంది.. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ను `పెళ్లి సందD` అనే సినిమాలో చేయబోతున్నారు.

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీలీల హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో చేయబోతున్నారు బ్రహ్మానందం. కొంతకాలంగా పెద్దగా సినిమాల్లో కనిపించని బ్రహ్మానందం.. ఇటీవల జాతిరత్నాలు సినిమాలో జడ్జ్ పాత్రలో కనిపించారు. జాతిరత్నాలు తర్వాత ఇప్పుడు పెళ్లిసందD సినిమాలో బ్రహ్మానందం కనిపించబోతున్నారు. రాఘవేంద్రరావు కూడా చాలా కాలం తర్వాత సినిమా తీస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి, బ్రహ్మానందం పార్ట్ షూటింగ్ ఇప్పటికే అయిపోయిందని, కనిపించేది కాసేపే అయినా.. కడుపుబ్బా నవ్విస్తారని అంటున్నారు. 1996లో శ్రీకాంత్‌ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సీక్వెల్ పెళ్లి సందD ఈ మూవీకి గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.