చైనా పర్యటనలో మోదీకి హోంగ్‌చీ కారు ఇచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?  

చైనాలో తయారైన ఈ బ్రాండ్‌ కారు జిన్‌పింగ్‌ అధికారిక పర్యటనల్లో ఉపయోగించే కారు. రెడ్ ఫ్లాగ్‌ అని కూడా దీన్ని పిలుస్తారు. హోంగ్‌చీ ఎల్5 మోడల్‌ను 2019లో తమిళనాడు మహాబలిపురంలో మోదీని కలిసినప్పుడు జిన్‌పింగ్‌ ఉపయోగించారు.

చైనా పర్యటనలో మోదీకి హోంగ్‌చీ కారు ఇచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?  

SCO Summit

Updated On : August 31, 2025 / 9:36 PM IST

SCO Summit: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత మొదటి సారి చైనా పర్యటనకు వెళ్లారు. మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌.. హోంగ్‌చీ కారును ఇచ్చారు. చైనా పర్యటనలో మోదీ దీన్ని వాడుకుంటున్నారు.

చైనాలో తయారైన ఈ బ్రాండ్‌ కారు జిన్‌పింగ్‌ అధికారిక పర్యటనల్లో ఉపయోగించే కారు. రెడ్ ఫ్లాగ్‌ అని కూడా దీన్ని పిలుస్తారు. హోంగ్‌చీ ఎల్5 మోడల్‌ను 2019లో తమిళనాడు మహాబలిపురంలో మోదీని కలిసినప్పుడు జిన్‌పింగ్‌ ఉపయోగించారు. అటువంటి కారును మోదీ కోసం జిన్‌పింగ్ కేటాయించడం గమనార్హం.

కాగా, మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా టియాంజిన్‌ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమ్మిట్‌లో పాల్గొంటారు. హోంగ్‌చీ కార్ల తయారీ 1958లో ప్రారంభమైంది. దశాబ్దాల నాటి బ్రాండ్‌ ఇది.

Also Read: Health Tips: కళ్ళు తిరగడం దేనికి సంకేతం.. ప్రమాద హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం

ప్రారంభంలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఉన్నత వర్గం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. హోంగ్‌చీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్‌ వర్క్స్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ఇది. ఇది చైనాలోనే ప్రాచీన ప్యాసింజర్‌ కారు బ్రాండ్‌.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ఆయన రష్యా ఆటోమోటివ్‌ కంపెనీ అవురస్‌ మోటార్స్‌ తయారు చేసిన కారులో చైనీస్‌ దౌత్య లైసెన్స్‌ ప్లేట్లతో ప్రయాణిస్తారు. అవురస్‌ రెట్రో స్టైల్‌ లగ్జరీ వాహనం. రెట్రో స్టైల్‌ అంటే పాతకాలపు మోడల్‌ను అనుసరించి తయారుచేసిన స్టైల్‌.

ఆదివారం మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో “డ్రాగన్‌-ఎలిఫెంట్‌ కలిసి రావాల్సిన సమయం ఇది” అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. డ్రాగన్‌ అంటే చైనా, ఎలిఫెంట్‌ అంటే భారతదేశం.

మోదీ మాట్లాడుతూ.. 2.8 బిలియన్‌ భారతీయ-చైనీయుల సంక్షేమానికి ఈ రెండు ఆసియా దేశాల సహకారం అవసరమని చెప్పారు. “పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై కట్టుబడి ఉన్నాం” అని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక దేశాలపై వాణిజ్య సుంకాలను విధిస్తున్న సమయంలో చైనాలో షాంఘై సహకార సంస్థ సమ్మిట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. (SCO Summit)