Health Tips: కళ్ళు తిరగడం దేనికి సంకేతం.. ప్రమాద హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం

మనిషికి "కళ్లుతిరగడం" అనేది చాలా సాధారణంగా జరిగే విషయమే. ప్రతీ ఒక్కరు ఏదో (Health Tips)ఒక సందర్భంలో ఈ విషయాన్నీ ఎదుర్కొనే ఉంటారు.

Health Tips: కళ్ళు తిరగడం దేనికి సంకేతం.. ప్రమాద హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం

Health Tips: Is frequent dizziness a sign of danger?

Updated On : August 31, 2025 / 2:33 PM IST

Health Tips: మనిషికి “కళ్లుతిరగడం” అనేది చాలా సాధారణంగా జరిగే విషయమే. ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్నీ ఎదుర్కొనే ఉంటారు. సాధారణ అలసట, నీరు తక్కువ తాగడం వంటి కారణాల వల్ల ఏర్పడటం సజహమే. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులలో(Health Tips) కూడా ఇది ఒక ముఖ్య సూచన అయి ఉండొచ్చు. గుండె. మెదడు లాంటి ప్రధాన సమస్యల కారణంగా కూడా ఇలా తల తిరడగం అనుభూతి కలుగవచ్చు. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Omega-3 Fatty Acids: మనిషి ఆరోగ్యంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీ రోల్.. ఇది ఏ ఆహారంలో లభిస్తుందో తెలుసా?

1.స్ట్రోక్ (Stroke):
మెదడులో రక్తప్రవాహం ఆగిపోవడం లేదా రక్తస్రావం జరగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాపాయమైన పరిస్థితి. ఈ సమయంలో అకస్మాత్తుగా కళ్లుతిరగడం, చేతులు, కాళ్లలో మొద్దుబారటం, మాట తడబడడం, ముఖం ఒకవైపు వంగిపోవడం, చూపు తక్కువ కావడం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించకపోతే, పాక్షిక, పూర్తి వైకల్యం లేదా మరణానికి దారితీయవచ్చు.

2.హార్ట్ రీథం సమస్యలు (Arrhythmias):
హృదయ స్పందనలు అసాధారణంగా వేగంగా, నెమ్మదిగా ఉండటం వల్ల తలకు రక్త సరఫరా తక్కువగా జరుగుతుంది. దీనివల్ల కూడా కళ్లుతిరగడం సమస్య కనబడవచ్చు. గుండె కొట్టుకోవడంలో అసాధారణత, ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి, చక్కర్లు తిరుగుతున్న భావన, ఒక్కసారిగా నిష్చలంగా పడిపోవడం వంటివి జరుగవచ్చు. ఇది హార్ట్ అటాక్‌కు సంకేతంగా ఉండవచ్చు. వెంటనే చికిత్స అందించడం అవసరం.

3.లో బీపీ (Low Blood Pressure):
రక్తపోటు తీవ్రమైన స్థాయికి తగ్గినపుడు మెదడుకు సరిపడా రక్తం అందక కళ్లుతిరగడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు నిలబడ్డ వెంటనే కళ్లుతిరగడం, అలసట, కనుబొమ్మల చుట్టూ చీకట్లు రావడం, మూర్ఛ పడే అవకాశం లాంటివి కనిపిస్తాయి. ఈ పరిస్థితి సాధారణంగా అనిపించినా అధిక రక్తనష్టం, హృదయ సంబంధిత సమస్యల కారణం కావచ్చు.

4.మెనియర్ వ్యాధి:
చెవి లోపలి భాగంలో (inner ear) వ్యాధి వల్ల సమతుల్యత దెబ్బతిని కళ్లుతిరగడం జరుగుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు చెవిలో గుబుళ్లు లేదా శబ్దం, చెవిలో నొప్పి, బరువు, వాంతులు, ఒకవైపు చెవి వినికిడి తక్కువగా మారడం జరుగుతుంది.

5. బ్రెయిన్ ట్యూమర్, న్యూరాలజికల్ డిసార్డర్స్:
మెదడులో వృద్ధి చెందే ట్యూమర్‌లు లేదా నరాల వ్యాధులు, మిగతా భాగాలపై ఒత్తిడి కలిగించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో కూడా కళ్లు తిరగడం జరుగుతుంది. అప్పుడు, తలనొప్పి, చూపు మందగింపు, జ్ఞాపకం తగ్గిపోవడం, శరీరంలో ఒకవైపు బలహీనత లాంటి పరిస్థితులు ఏర్పడతాయి.

ఎప్పుడు వైద్యుని సంప్రదించాలి?

  • ఒక్కసారిగా పడిపోవడం
  • మాట్లాడలేకపోవడం
  • ఛాతీలో నొప్పి
  • వాంతులు, తీవ్ర తలనొప్పి
  • చూపు పోవడం.