Krishnam Raju – Brahmanandam : కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం గిఫ్ట్..
బ్రహ్మానందం, కృష్ణంరాజుని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు..

Krishnam Raju Brahmanandam
Krishnam Raju – Brahmanandam: కామెడీ కింగ్ బ్రహ్మానందం, రెబల్ స్టార్ కృష్ణంరాజుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కృష్ణంరాజు తుంటికి శస్త్ర చికిత్స జరిగిన తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోంది.
Krishnam Raju : కాలుజారి పడ్డ కృష్ణంరాజు.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ..
ఈ నేపథ్యంలో బ్రహ్మానందం, కృష్ణంరాజుని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. తాను ఇష్టంగా వేసిన సాయిబాబా చిత్రపటాన్ని కృష్ణంరాజుకి బహూకరించారు. కృష్ణంరాజు, సతీమణి శ్యామలా దేవి బ్రహ్మానందంను ఆప్యాయంగా సత్కరించారు.
అనారోగ్య కారణాల వల్ల కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మానందం ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తున్నారు. కృష్ణంరాజు, ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిం ‘రాధే శ్యామ్’ లో ఇంపార్టెంట్ రోల్ చేశారు.
