Telugu Indian Idol Season 4 : తెలుగు ఇండియన్ ఐడల్.. సింగింగ్ షోలో బ్రహ్మానందం..
ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోలోని (Telugu Indian Idol Season 4) ఓ ఎపిసోడ్‌కు బ్రహ్మానందం గెస్ట్‌గా వచ్చారు.

Brahmanandam graces the TeluguIndianIdol stage
Telugu Indian Idol Season 4 : ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. సూపర్ హిట్ మూవీలు, వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే గేమ్ షోలను అందిస్తుంది. ఇక సింగింగ్ టాలెంట్ ఉన్న గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో సింగింగ్ షోను తీసుకుంది. ఇప్పటి వరకు విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి కాగా.. ప్రస్తుతం నాలుగో సీజన్ (Telugu Indian Idol Season 4) నడుస్తోంది.
Duvvada Srinivas : మాధురికి వచ్చే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఏం చేస్తానంటే.. దువ్వాడ కామెంట్స్..
నాలుగో సీజన్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఓ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా కామెడీ కింగ్ బ్రహ్మానందం వచ్చారు. తనదైన శైలిలో నవ్వుల విందు పంచారు. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 17, 18 తేదీల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ షోకు సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.