Manity : ‘ది మానిటీ.ఇన్’.. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న హాలీవుడ్ సినిమా..
తాజాగా దర్శక నిర్మాత బిఎస్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్స్ ని విడుదల చేసారు. (Manity)
Manity
Manity : ఇప్పుడు టాలీవుడ్ లో కూడా భర్తీ సినిమాలు, VFX సినిమాలు తెరకెక్కుతున్నాయి. హాలీవుడ్ ని టార్గెట్ చేసుకొని సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ బీఎస్ రావు సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘ది మానిటీ.ఇన్’ అనే టైటిల్ తో హాలీవుడ్ యాక్షన్ తరహాలో IMAX8K ఫార్మాట్లో ఒక విజువల్ పోయెట్రీలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. “When humanity is neglected… Manity arises” అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా రానుంది.
Also Read : Rashmika Mandanna : పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన రష్మిక..
తాజాగా దర్శక నిర్మాత బిఎస్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్స్ ని విడుదల చేసారు. అనంతరం బిఎస్ రావు మాట్లాడుతూ.. సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఎలా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ గా ఈ కథ రాసాను. ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తుంది. రాజమౌళి సైతం ఐమాక్స్ ఫార్మాట్లో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. నేను నా మొదటి సినిమాతోనే IMAX 8K లో చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ లో ఇద్దరు హీరోలు ఉంటారు. ఈ కాన్సెప్ట్ నచ్చి ఏ హీరో వచ్చినా చేస్తాను. హాలీవుడ్ టెక్నీషియన్లతో సమానంగా ఇక్కడ వాళ్ళు కూడా అచేసేలాగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నాను. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో నాకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించి తక్కువ సమయంలోనే ఈ సినిమాని పూర్తి చేస్తాను. త్వరలోనే ఈ సినిమాకు పనిచేయబోయే నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించి షూటింగ్ మొదలుపెడతాను. యూత్ మరియు పిల్లలు ఈ సినిమాలోని విజువల్స్, క్యారెక్టరైజేషన్స్‌కు ఫిదా అవుతారు. తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపారు.

ఇక రిలీజ్ చేసిన పోస్టర్స్ లో.. అంతరిక్షం, నగరం, అడవి, సముద్రం వంటి విభిన్న ఎలిమెంట్స్ ఒకే చోట కనిపించాయి. పోస్టర్ ఎగువ భాగంలో కనిపిస్తున్న కాస్మిక్ విజువల్స్ ఈ సినిమా ఒక ఎపిక్ విజువల్ స్పెక్టాకిల్ కాబోతోందని తెలుస్తుంది. పోస్టర్ దిగువన ఎరుపు రంగు అడవిలో పరిగెడుతున్న ఒక అమ్మాయిని చూస్తుంటే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

