Bunny Vasu
Bunny Vasu : బన్నీ వాసు ఇప్పుడు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకుపోతున్నారు. అలాగే గీత ఆర్ట్స్ లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఒక యానిమేటర్ గా సినీ పరిశ్రమలోకి వచ్చి అల్లు అర్జున్ దగ్గర చేరి బన్నీ వాసుగా మారిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా బన్నీ వాసు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను డిస్ట్రిబ్యూటర్ గా ఎలా మారింది అని ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Kantara Collections : వాట్.. మూడు రోజుల్లోనే ఇన్ని కోట్లు వచ్చాయా? కాంతార ఛాప్టర్ 1 కలెక్షన్స్..
బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆర్య సినిమా పాలకొల్లు వరకు బిజినెస్ నాకు ఇమ్మన్నాడు బన్నీ. కానీ అక్కడ అప్పటికే వేరే డిస్ట్రిబ్యూటర్ ఉండటంతో అతను రేటు ఎక్కువ చెప్పారు. నేను దిల్ రాజుకి చెప్తే ఏకంగా గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. అదే నాకు ఫస్ట్ టైం. అప్పుడు నా చేతిలో 45 రూపాయలు ఉంటే అవి దిల్ రాజు గారికి ఇచ్చాను. అయన నవ్వి సరే అడ్వాన్స్ పంపు అన్నారు.
దాని కోసం నేను నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాను. అలా చిరంజీవి గారి భార్య సురేఖ గారి దగ్గర 5000 తీసుకున్నాను. ఆవిడ చెయ్యి మంచిది అని ఆవిడ దగ్గర మొదట తీసుకున్నాను. ఇప్పటికి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు ఆవిడకు. ఆ తర్వాత అరవింద్ గారి భార్య, ఇంకొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని దిల్ రాజుకి అడ్వాన్స్ ఇచ్చాను. అలా డిస్ట్రిబ్యూటర్ గా నా కెరీర్ మొదలైంది అని తెలిపారు.