Mohan Babu : నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్‌బాబు వ్యాఖ్యలపై.. సి.కల్యాణ్ షాకింగ్ రియాక్షన్..!
నిర్మాతల మధ్య ఐక్యత లేదు అందుకే ఈ సమస్యలు అంటూ మోహన్ బాబు రాసిన ఈ లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. ''ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో......

Mohan Babu
Mohan Babu : గత కొద్దీ రోజులుగా సినీ పరిశ్రమ సమస్యలు, థియేటర్ సమస్యలు, సినిమా టికెట్ రేట్ల విషయాలలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికీ రుచించట్లేదు. ఇప్పటికే వీటిపై చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా మోహన్ బాబు ఈ సమస్యలపై స్పందించి నిర్మాతలంతా వెళ్లి ప్రభుత్వాలని అడుక్కోవాలి. అందరం కలిసి వెళ్లి అడుగుదాం. నిర్మాతల మధ్య ఐక్యత లేదు అందుకే ఈ సమస్యలు అంటూ సంచలన లేఖ రాశారు.
Keerthy Suresh : ఎమ్మెల్యే పక్కన హీరోయిన్ గా చేయబోతున్న కీర్తి సురేష్
మోహన్ బాబు రాసిన ఈ లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ స్పందించారు. నిన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ”ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. ఆయన ముందుండి సమస్యని పరిష్కరిస్తానంటే ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అన్నారు. అయితే మోహన్ బాబు కూడా నిర్మాతే. అయన కొడుకు కూడా నిర్మాతే. ఈ సమస్యల్ని ముందుండి పరిసారిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటామని” అన్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.