ఐ ఫోన్లో అద్భుతంగా తీశారు.. సెప్టెంబర్ 1న ‘సీ యూ సూన్’..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 07:58 PM IST
ఐ ఫోన్లో అద్భుతంగా తీశారు.. సెప్టెంబర్ 1న ‘సీ యూ సూన్’..

Updated On : August 27, 2020 / 8:39 PM IST

C U Soon from 1st September: లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి.. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు ఎంటర్‌‌టైన్‌మెంట్ అందించడానికి పలు ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. కరోనా కాలంలో రామ్ గోపాల్ వర్మ ఒక్కడే సినిమా తీసి రిలీజ్ చేసే సాహసం చేశాడు. ఇప్పుడు పాపులర్ మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా లాక్‌డౌన్ టైంలో సినిమా తీసి విడుదల చేయబోతున్నాడు. ఆ సినిమాను ఐ ఫోన్లో షూట్ చేయడం విశేషం.

మహేష్ నారయణన్ దర్శకత్వంలో ఫాహద్ అతని భార్య, హీరోయిన్ నజ్రియా నజీమ్ కలిసి నిర్మించిన సినిమా.. ‘సీ యూ సూన్’(C U Soon).. ఫాహద్, రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటవల ట్రైలర్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. కంప్యూటర్ స్క్రీన్ బేస్ట్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా ఇండియన్ ఫిలిం హిస్టరీలో సరికొత్త చిత్రమని, ప్రజలు ఎప్పుడూ వర్చువల్‌గా కలిసే ఉంటున్నారనే దాన్ని కథాంశంగా తీసుకున్నాం.. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ ద్వారా ‘సీ యూ సూన్’ విడుదల కానుంది.