కరోనా ఎఫెక్ట్ – బొమ్మలేస్తున్న భాయిజాన్

కరోనా ఎఫెక్ట్ - బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్కెచ్ వేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు..

  • Published By: sekhar ,Published On : March 19, 2020 / 07:54 AM IST
కరోనా ఎఫెక్ట్ – బొమ్మలేస్తున్న భాయిజాన్

Updated On : March 19, 2020 / 7:54 AM IST

కరోనా ఎఫెక్ట్ – బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్కెచ్ వేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు..

కరోనా వైరస్.. ఏ క్షణాన ఏం జరుగుతోందనని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపడుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. విదేశాల నుంచి రాకపోకలను నిలిపి వేసింది.

షూటింగులు బంద్ కావడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు తీసుకోవాలసిన జాగ్రత్తలు సూచిస్తూ, వర్కౌట్లు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త టాలెంట్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. పేపర్‌పై మహిళ, పురుషుడి స్కెచ్ వేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

భాయిజాన్ స్కెచ్‌లో స్త్రీ, పురుషుడు నల్లటి దుస్తుల్లో ఉన్నారు. ప్రస్తుతం మనం ధరించే విధానం.. భారత సంసృతి గొప్పదనం’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. సల్మాన్, ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధే’ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రంజాన్‌కు విడుదల చేయాలనుకుంటున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan) on