శ్రీముఖిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..

యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు..
బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షో లో దృశ్యాలను చిత్రీకరించారని జెమినీ టీవీ మరియు యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. జూలకటక అనే కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ నల్లకుంటకు చెందిన వెంకట రమణ శర్మ ఫిర్యాదు చేశారు.
దీంతో జెమినీ ఛానెల్ మరియు శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పలు బుల్లితెర షోలపై విమర్శలు వెల్లువెత్తాయి, మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా చేశారు. విచారణ చేపడతామని, పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామని పోలీసులు తెలిపారు.
Also Read | ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్లపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము-తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి