Harsha Sai : పరారీలో యూట్యూబర్ హర్ష సాయి.. పోలీసుల గాలింపు.. నాలుగు బృందాలతో..
ప్రస్తుతం యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడు.

Case Filed on Harsha Sai He Escaped Police Finding Him
Harsha Sai : ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై ఓ నటి, నిర్మాత లైంగిక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో హర్ష సాయితో చేస్తున్న మెగా అనే సినిమా కాపీ రైట్స్ విషయంలోనే తనను లైంగికంగా వేధించాడని, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసాడని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసు నమోదు చేసారు. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసారు.
ఇప్పటికే బాధితురాలకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక దీనిపై హర్ష సాయి తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. కేవలం డబ్బుల కోసమే ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్లు చూసుకుంటారు అని అన్నాడు.
Also Read : Jackky Bhagnani : స్టార్ డైరెక్టర్ పై కేసు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. ఆ విషయంలో..
అయితే ప్రస్తుతం యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. నాలుగు బృందాలుగా హర్ష సాయి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. హర్ష సాయి ముంబైలో ఉన్నట్టు సమాచారం.